సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?
Breaking News
కామన్‌వెల్త్ గేమ్స్‌లో అపశ్రుతి.. జిమ్నాస్టిక్స్‌లో భయానక దృశ్యం!
Published on Sun, 07/26/2026 - 12:42
కామన్‌వెల్త్ గేమ్స్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. జిమ్నాస్టిక్స్ ఫైనల్ ఈవెంట్ సందర్భంగా ఇంగ్లండ్ జిమ్నాస్ట్ గాబ్రియెల్ లాంగ్టన్ హారిజంటల్ బార్‌పై పట్టు కోల్పోయి తలకిందులుగా మ్యాట్‌పైకి జారిపడ్డాడు. దీంతో అతడి మెడకు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. సపోర్ట్ స్టాఫ్ వచ్చి లాంగ్టన్‌కు అత్యవసర చికిత్స అందించారు.

Photo Credit: CWG 2026 Twitter
ఆ తర్వాత లాంగ్టన్ లేవడానికి ఇబ్బంది పడడంతో స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. లాంగ్టన్ కిందపడడంతో కాసేపు భయానక వాతావరణం నెలకొనడంతో పోటీలు నిలిపివేశారు. ఇప్పటికే గాయంతో ఆరుసార్లు ఒలింపిక్ విజేత మాక్స్ విట్‌లాక్ దూరమవ్వడంతో అతడి స్థానంలో లాంగ్టన్‌కు అవకాశమిచ్చారు.
వరుసగా నాలుగో కామన్‌వెల్త్ గేమ్స్ పురుషుల టీం టైటిల్ కోసం ఇంగ్లండ్ ప్రయత్నిస్తున్న సమయంలో చివరి రౌండ్‌లో లాంగ్టన్ గాయపడడం ఇంగ్లండ్‌ను దెబ్బతీసింది. ఆ తర్వాత లాంగ్టన్ లేకుండానే పోటీలు పూర్తి చేసిన ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచి వెండి పతకం గెలుచుకోగా, కెనడా, ఆస్ట్రేలియా జట్లు స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాయి.

Photo Credit: CWG 2026 Twitter
ఇక గాబ్రియెల్ లాంగ్టన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఇంగ్లండ్ టీమ్ ప్రకటించింది. అతడి పరిస్థితి మెరుగ్గానే ఉందని, కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని తెలిపింది. లాంగ్టన్ గాయాలతో పోటీకి దూరమైనప్పటికీ, తన జట్టు సిల్వర్ మెడల్ సాధించడంతో సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తున్నట్లు ఇంగ్లం్ టీమ్ వెల్లడించింది.
🚨NEWS: English gymnast Gabriel Langton has been rushed to hospital after suffering a major fall during the Commonwealth Games pic.twitter.com/bXsMusO5fF
— Basil the Great (@BasilTheGreat) July 25, 2026
చదవండి: ఆటలోనే కాదు ఆ విషయంలోనూ మెస్సీ కింగే!
Tags : 1