Breaking News

ఇంగ్లండ్ బ్యాటర్ల సెంచరీల మోత.. ఏకంగా 565 పరుగులు

Published on Fri, 05/23/2025 - 17:29

సొంత గడ్డపై టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టుకు అదిరిపోయే ప్రాక్టీస్‌ లభించింది. నాటింగ్‌హామ్ వేదిక‌గా జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లండ్ బ్యాట‌ర్లు దంచి కొట్టారు. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించింది. 498/3 ఓవర్‌ నైట్‌స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌.. తమ మొదటి ఇన్నింగ్స్‌ను 565/6 వద్ద డిక్లేర్‌ చేసింది.  

ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జాక్‌ క్రాలీ (171 బంతుల్లో 124; 14 ఫోర్లు), బెన్‌ డకెట్‌ (134 బంతుల్లో 140; 20 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఒలీ పోప్‌ (163 బంతుల్లో 171, 24 ఫోర్లు, 2 సిక్స్‌లు)  భారీ శతకాలతో కదం తొక్కగా... హ్యారీ బ్రూక్‌(58), రూట్‌(34) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌల‌ర్ల‌లో ముజారబానీ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. చ‌వింగా, మాధ‌వీరే, ర‌జా త‌లా వికెట్ సాధించారు

.కాగా ఇంగ్లండ్ జ‌ట్టు తొలి రోజే రికార్డు స్థాయిలో 88 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 498 పరుగులు చేసింది. టెస్టు క్రికెట్‌లో తొలి రోజు నమోదైన రెండో అత్యధిక స్కోరు ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. అంత‌కుముందు 2022లో పాకిస్తాన్‌పై ఇంగ్లండ్‌ తొలి రోజు 506/4 పరుగులు చేసింది. మ‌రో 9 ప‌రుగులు చేసుంటే ఇంగ్లీష్ జ‌ట్టు త‌మ రికార్డును తామే బ్రేక్ చేసేది.
తుది జ‌ట్లు
ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, జో రూట్, ఓల్లీ పోప్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), గస్ అట్కిన్సన్, సామ్యూల్ జేమ్స్ కుక్, జోష్ టంగ్, షోయబ్ బషీర్

జింబాబ్వే: బెన్ కర్రాన్, బ్రియాన్ బెన్నెట్, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్‌), సీన్ విలియమ్స్, సికందర్ రజా, వెస్లీ మాధేవెరే, తఫాద్జ్వా త్సిగా (వికెట్ కీప‌ర్‌), రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ, తనకా చివంగ, విక్టర్ న్యౌచి
 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)