తొలి వన్డే.. కోహ్లిని ఆకాశానికి ఎత్తిన ఇంగ్లండ్ కోచ్‌

Published on Tue, 07/14/2026 - 11:58

ఇంగ్లండ్‌, టీమిండియా మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మరికొన్ని గంటల్లో తొలి వన్డే మొదలుకానుంది. జనవరిలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ తర్వాత వన్డేలు ఆడని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు జట్టులోకి తిరిగొచ్చారు. రో-కో ద్వయం తిరిగి రావడంతో పాటు గిల్‌, కేఎల్ రాహుల్ కూడా జాయిన్ కావడంతో టీమిండియా సరికొత్తగా కనిపిస్తుంది. అయితే ఇంగ్లండ్‌తో తొలి వన్డే నేపథ్యంలో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ కోహ్లిని ఆకాశానికి ఎత్తాడు. 

'క్రీడా ప్రపంచంలో కోహ్లి ఒక నిజమైన చాంపియన్‌. తన దూకుడైన ఆటతో క్రీడకు సరికొత్త నిర్వచనం చెప్పి ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచాడు. కోహ్లి కేవలం క్రికెట్ ప్రపంచంలోనో లేక‌ భారతదేశంలోనో మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడల రంగాల‌కు కూడా సుప‌రిచితుడిగా మారిపోయాడు. ప్రజలు క్రికెట్‌ను ప్రేమించేలా  చేయ‌డంలో కోహ్లి స్ఫూర్తినిచ్చాడు. ఆట‌కు వీడ్కోలు ప‌లికిన త‌ర్వాత కోహ్లి వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోతుంది. అత‌డు నిజమైన ఛాంపియన్.' అని పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించాడు.

ఇటీవలే ఇంగ్లండ్ వ‌రుస టెస్టు సిరీస్ ప‌రాజ‌యాలు చ‌విచూడ‌డంతో టెస్టు కోచ్ పదవికి బ్రెండన్ మెక్‌క‌ల్ల‌మ్ గుడ్‌బై చెప్పాడు. అయితే ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్ (వ‌న్డే, టీ20 ఫార్మాట్‌)లో మాత్రం హెడ్‌కోచ్‌గా కొన‌సాగ‌నున్నట్లు స్ప‌ష్టం చేశాడు. తాజాగా టెస్టు కోచ్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవడంపై స్పందించిన మెక్‌క‌ల్ల‌మ్ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు క్ష‌మాప‌ణ తెలిపాడు. 

టెస్టు కోచ్ ప‌ద‌వి నుంచి తప్పుకోవాల‌నే నిర్ణ‌యం బాధించిన‌ప్ప‌టికీ ప‌రిస్థితుల ప్ర‌భావంతోనే అలా చేయాల్సి వ‌చ్చింద‌న్నాడు.  అయితే త‌న నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని మెక్‌క‌ల్ల‌మ్ పేర్కొన్నాడు. త‌న నిర్ణ‌యం ప‌ట్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు క్ష‌మాప‌ణ కోరుతున్న‌ట్లు తెలిపాడు. టెస్టు కోచ్‌గా త‌న పాత్ర‌ను స‌మ‌ర్థంగా పోషించ‌లేక‌పోయాన‌ని, అందుకే త‌ప్పుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించాడు. 

మెక్‌క‌ల్ల‌మ్ టెస్టు కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలి రోజుల్లో బెన్‌స్టోక్ కెప్టెన్సీలో 'బ‌జ్‌బాల్' ఆట‌తో ఇంగ్లండ్ 11 టెస్టుల్లో 10 విజ‌యాలు సాధించి కొత్త శ‌కానికి నాంది ప‌లికింది. కానీ రానురాను బ‌జ్‌బాల్ ఆట ఇంగ్లండ్ కొంప‌ముంచింది. ఈ మ‌ధ్య కాలంలో ఇంగ్లండ్ ఆడిన 9 టెస్టుల్లో ఏడింటిలో ప‌రాజ‌యం చ‌విచూసి డబ్ల్యూటీసీ టైటిల్ రేసులో చాలా వెనుక‌బ‌డిపోయింది.  ఆ త‌ర్వాత స్టోక్స్ ఉదంతం అత‌డిని కెప్టెన్సీ నుంచి తొల‌గించేలా చేసింది. ఆ వెంట‌నే మెక్‌క‌ల్ల‌మ్ టెస్టు కోచ్ ప‌ద‌వి నుంచి వైదొలగుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

 

Read: ఫిఫా చరిత్రలో తొలిసారి.. సెంటిమెంట్‌తో బరిలోకి అర్జెంటీనా!

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)