బట్లర్‌ సుడిగాలి శతకం.. ఐదో మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమి

Published on Sat, 07/11/2026 - 23:18

ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ గెలుపు లేకుండానే ముగించింది. సౌతాంప్టన్‌ వేదికగా ఇవాళ (జులై 11) జరిగిన నామమాత్రపు ఐదో మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమిపాలైంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా.. ఆతర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఇంగ్లండే గెలుపొందింది. తద్వారా 4-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

నేటి మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (45 బంతుల్లో 95 నాటౌట్‌; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 

భారత బౌలర్లలో ప్రిన్స్‌ యాదవ్‌ (4-0-60-0), అక్షర్‌ పటేల్‌ (4-0-63-0), సూర్యాంశ్‌ షేడ్గే (3-0-39-0) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. శివమ్‌ దూబే ఒకే ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే అదే ఓవర్‌లో 2 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ (4-0-33-0), ప్రసిద్ద్‌ కృష్ణ (4-0-38-1) పొదుపుగా బౌలింగ్‌ చేశారు.

అనంతరం కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ చేయాల్సిన ప్రయత్నమంతా చేసినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. లక్ష్యం మరీ పెద్దది కావడంతో టీమిండియా చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమైంది. తద్వారా 56 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. 

భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌ (56), తిలక్‌ వర్మ (53) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా ఆటగాళ్లలో సంజూ శాంసన్‌ (27), శ్రేయస్‌ అయ్యర్‌ (28), శివమ్‌ దూబే (14) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే పరిమితయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో సామ్‌ కర్రన్‌ 3, ఆదిల్‌ రషీద్‌ 2, ఆర్చర్‌, టంగ్‌, డాసన్‌ తలో వికెట్‌ తీశారు.

 

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)