ఆఖరిదీ పోయింది

Published on Sun, 07/12/2026 - 04:14

సౌతాంప్టన్‌: ఐర్లాండ్‌–ఇంగ్లండ్‌ టి20 టూర్‌ను భారత జట్టు ఒక్క గెలుపు లేకుండా శూన్య హస్తాలతో ముగించింది. ఫలితం తేలిన 6 మ్యాచ్‌లలోనూ జట్టు పరాజయంపాలైంది. ఐర్లాండ్‌ చేతిలో 0–2తో ఓడిన టీమిండియా, ఇప్పుడు ఇంగ్లండ్‌ చేతిలో 0–4తో ఓడటంతో కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ ప్రయాణం తీవ్ర నిరాశతో మొదలైంది. శనివారం జరిగిన ఐదో టి20లో ఇంగ్లండ్‌ 56 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. 

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. భారత్‌పై ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు. జోస్‌ బట్లర్‌ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్స్‌లు) అంతర్జాతీయ టి20లో తన రెండో సెంచరీతో చెలరేగగా...కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ (45 బంతుల్లో 95 నాటౌట్‌; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) త్రుటిలో ఆ అవకాశాన్ని కోల్పోయాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 103 బంతుల్లోనే 233 పరుగులు జోడించడం విశేషం. అనంతరం భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసింది. 

ఇషాన్‌ కిషన్‌ (35 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్‌ వర్మ (25 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా...శ్రేయస్‌ అయ్యర్‌ (16 బంతుల్లో 28; 4 ఫోర్లు), సంజు సామ్సన్‌ (14 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు.  ఇప్పటి వరకు ఐసీసీ టి20 టీమ్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న భారత్‌ను వెనక్కి నెట్టి తాజా ఫలితంతో ఇంగ్లండ్‌ అగ్రస్థానానికి చేరుకుంది.  

ప్రసిధ్‌ రెండో ఓవర్లోనే సాల్ట్‌ (6)ను వెనక్కి పంపినా...ఆ తర్వాత బట్లర్, బ్రూక్‌ కలిసి చెలరేగిపోయారు. ఏ భారత బౌలర్‌నూ వదిలిపెట్టకుండా వీరిద్దరు ఆధిపత్యం ప్రదర్శించారు. పవర్‌ప్లేలో ఇంగ్లండ్‌ 61 పరుగులు చేయగా...అక్షర్‌ ఓవర్లో ఏకంగా 25 పరుగులు రాబట్టడంతో 10 ఓవర్లలో స్కోరు 111 పరుగులకు చేరింది. 19 బంతుల్లోనే బ్రూక్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. ప్రిన్స్‌ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4 బాదిన బట్లర్‌...అక్షర్‌ ఓవర్లో భారీ సిక్స్‌తో 51 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. 

చివరి 4 ఓవర్లలో ఇంగ్లండ్‌ 48 పరుగులు రాబట్టింది. అనంతరం భారీ లక్ష్య ఛేదన భారత్‌కు కష్టంగా మారిపోయింది. పవర్‌ప్లేలో 65/2తో మెరుగ్గానే కనిపించిన జట్టు 10 ఓవర్లలో 110 పరుగులు చేసి ప్రత్యర్థితో సమంగానే నిలిచింది. అయితే ఆ తర్వాత తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చిన జట్టు 11–20 ఓవర్ల మధ్య 91/6 పరుగులు మాత్రమే చేయగలిగి ఓటమిపాలైంది. 

వైభవ్‌ స్థానంలో సామ్సన్‌... 
మూడు మ్యాచ్‌లలో వైఫల్యాల తర్వాత సంజు సామ్సన్‌ను పక్కన పెట్టి వైభవ్‌ సూర్యవంశీకి అవకాశం కల్పించిన భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఈ మ్యాచ్‌లో సామ్సన్‌ను మళ్లీ జట్టులోకి తీసుకుంది. 15 ఏళ్ల వయసులో భారీ అంచనాలతో బరిలోకి దిగి వరుసగా 14, 13, 15 పరుగులు మాత్రమే చేసిన వైభవ్‌ను టీమ్‌ ఈ సారి పక్కన పెట్టింది.

233 అంతర్జాతీయ టి20ల్లో రెండో వికెట్‌కు బట్లర్, బ్రూక్‌ జోడించిన 233 పరుగులే అత్యధిక భాగస్వామ్యం కాగా...ఓవరాల్‌గా ఏ వికెట్‌కైనా ఇది నాలుగో అత్యధిక పార్ట్‌నర్‌షిప్‌.

7 శ్రేయస్‌ అయ్యర్‌ వరుసగా గెలిచిన టాస్‌ల సంఖ్య. కెప్టెన్గా తొలి 7 మ్యాచ్‌లలో అయ్యర్‌ ఈ ఫీట్‌ ప్రదర్శించగా... గతంలో వాలీ హామండ్‌ (8) మాత్రమే కెప్టెన్గా తన తొలి 8 మ్యాచ్‌లలో టాస్‌ నెగ్గాడు.

మూడు క్యాచ్‌లు వదిలిపెట్టి... 
భారత జట్టు పేలవ ఫీల్డింగ్‌ ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. బ్రూక్‌ 3 పరుగుల వద్ద శివమ్‌ దూబే, బట్లర్‌ 101 వద్ద ఉన్నప్పుడు సూర్యాంశ్‌ షెడ్గే, 90 వద్ద బ్రూక్‌ ఇచ్చిన క్యాచ్‌ను ఇషాన్‌ కిషన్‌ వదిలేశారు. అన్నింటిలో షార్ట్‌ థర్డ్‌మాన్‌ స్థానంలో బంతిని సరిగా అంచనా వేయలేక దూబే వదిలేసిన బ్రూక్‌ క్యాచ్‌ భారీ నష్టం కలిగించింది!

స్కోరు వివరాలు
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) సూర్యాంశ్‌ (బి) ప్రసిధ్‌ 6; బట్లర్‌ (సి) అయ్యర్‌ (బి) దూబే 131; బ్రూక్‌ (నాటౌట్‌) 95; బెతెల్‌ (సి) తిలక్‌ (బి) దూబే 0; జాక్స్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 257.  వికెట్ల పతనం: 1–8, 2–241, 3–241. బౌలింగ్‌: అర్ష్ దీప్ 4–0–33–0, ప్రసిధ్‌ 4–0–38–1, ప్రిన్స్‌ యాదవ్‌ 4–0–60–0, అక్షర్‌ 4–0–63–0, సూర్యాంశ్‌ 3–0–39–0, శివమ్‌ దూబే 1–0–22–0.  

భారత్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) బెతెల్‌ (బి) కరన్‌ 27; అభిషేక్‌ (సి) బట్లర్‌ (బి) ఆర్చర్‌ 3; ఇషాన్‌ కిషన్‌ (సి) సాల్ట్‌ (బి) రషీద్‌ 56; అయ్యర్‌ (సి) కరన్‌ (బి) డాసన్‌ 28; తిలక్‌ (సి) బట్లర్‌ (బి) టంగ్‌ 53; దూబే (సి) ఆర్చర్‌ (బి) కరన్‌ 14; సూర్యాంశ్‌ (సి) బట్లర్‌ (బి) కరన్‌ 7; అక్షర్‌ (సి) జాక్స్‌ (బి) రషీద్‌ 3; అర్ష్ దీప్ (నాటౌట్‌) 4; ప్రసిధ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 201.  వికెట్ల పతనం: 1–25, 2–55, 3–110, 4–131, 5–162, 6–189, 7–193, 8–199.  బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–41–1, టంగ్‌ 4–0–53–1, జాక్స్‌ 3–0–32–0, స్యామ్‌ కరన్‌ 4–0–36–3, డాసన్‌ 2–0–14–1, రషీద్‌ 3–0–24–2.  

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)