Breaking News

7 వికెట్లతో చెలరేగిన ఇంగ్లండ్‌ స్పిన్నర్‌.. తొలి టెస్టులో భారత్‌ ఓటమి

Published on Sun, 01/28/2024 - 17:57

ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా ఓటమితో ఆరంభించింది. హైదరాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో బారత్‌ ఓటమి పాలైంది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 202 పరుగులకు ఆలౌటైంది. 

ఇంగ్లండ్‌ అరంగేట్ర స్పిన్నర్‌ టామ్‌ హార్ట్‌లీ 7 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించాడు. భారత బ్యాటర్లలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(39) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కాగా లక్ష్య ఛేదనలో 119 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.  

ఈ క్రమంలో రవిచంద్రన్‌ అశ్విన్‌, శ్రీకర్‌ భరత్‌ నిలకడగా ఆడుతూ భారత విజయంపై ఆశలు రెకెత్తించారు. ఎనిమిదో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే టామ్‌ హార్ట్‌లీ భరత్‌ను ఔట్‌ చేయడంతో మళ్లీ మ్యాచ్‌ ఇంగ్లండ్‌ వైపు మలుపు తిరిగింది. వెంటనే అశ్విన్‌ కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు.

అనంతరం సిరాజ్‌, బుమ్రా కాసేపు పోరాడనప్పటికీ ఓటమి నుంచి గట్టుఎక్కించ లేకపోయారు. భారత బ్యాటర్లలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(39) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఓవర్‌నైట్‌ స్కోర్‌ 316/6తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ అదనంగా 104 పరుగుల జోడించింది. రెండో ఇన్నింగ్స్‌లో 420 పరుగులకు ఇంగ్లీష్‌ జట్టు ఆలౌటైంది.

దీంతో భారత్‌ ముందు 230 పరుగుల లక్ష్యాన్ని ఉంచగల్గింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో ఓలీ పోప్‌(196) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కాగా అంతకముందు భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా(87), రాహుల్‌(86), జైశ్వాల్‌(80) పరుగులతో రాణించారు. అదే విధంగా ఇంగ్లండ్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా జరగనుంది.
చదవండి: #Shubman Gill: నీవు మరి మారవా గిల్‌..? ఇంకా ఎన్ని ఛాన్స్‌లు! అతడిని తీసుకోండి?

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?