Breaking News

అగ్రస్థానానికి ఎగబాకిన ఇంగ్లండ్‌

Published on Sat, 03/04/2023 - 16:01

ICC Cricket World Cup Super League Points Table: ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ సూపర్‌ లీగ్‌ పాయింట్ల పట్టికలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ అగ్రస్థానానికి ఎగబాకింది. శుక్రవారం (మార్చి 3) బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన అనంతరం ఇంగ్లండ్‌ టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది. ఈ గెలుపుతో మరో మ్యాచ్‌ మిగిలుండగానే 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్‌ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్‌ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన ఇంగ్లండ్‌.. 20 పాయింట్లు ఖాతాలో వేసుకుని మొత్తంగా 155 పాయింట్లు (23 మ్యాచ్‌లు) సాధించింది.

ఇంగ్లండ్‌ భారీగా పాయింట్లు సాధించడంతో అగ్రస్థానంలో ఉండిన న్యూజిలాండ్‌.. 150 పాయింట్లకు (21 మ్యాచ్‌ల్లో) పరిమితమై రెండో స్థానానికి దిగజారింది. 21 మ్యాచ్‌ల్లో 139 పాయింట్లు కలిగిన టీమిండియా మూడో స్థానంలో, 21 మ్యాచ్‌ల్లో 130 పాయింట్లు సాధించిన పాకిస్తాన్‌ నాలుగులో, 18 మ్యాచ్‌ల్లో 120 పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా ఐదో స్థానంలో, ఆతర్వాత బంగ్లాదేశ్‌ (20 మ్యాచ్‌ల్లో 120), ఆఫ్ఘనిస్తాన్‌ (15 మ్యాచ్‌ల్లో 115), వెస్టిండీస్‌ (24 మ్యాచ్‌ల్లో 88), సౌతాఫ్రికా (19 మ్యాచ్‌ల్లో 78), శ్రీలంక (21 మ్యాచ్‌ల్లో 77), ఐర్లాండ్‌ (21 మ్యాచ్‌ల్లో 68), జింబాబ్వే (21 మ్యాచ్‌ల్లో 45), నెదర్లాండ్స్‌ (19 మ్యాచ్‌ల్లో 25) వరుస స్థానాల్లో నిలిచాయి.

కాగా, ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ సూపర్‌ లీగ్‌ పాయింట్ల ఆధారంగా వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించే బెర్తులు ఖరారవుతాయి. 2023 వన్డే ప్రపంచకప్‌కు ఆతిధ్యమిస్తున్న కోటాలో భారత్‌ నేరుగా వరల్డ్‌కప్‌కు క్వాలిఫై కాగా.. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లు ఇప్పటివరకు 2023 వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి.      

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)