Breaking News

రూట్‌ పునరాగమనం

Published on Mon, 12/23/2024 - 03:03

లండన్‌: చివరిసారి భారత్‌ వేదికగా 2023లో జరిగిన ప్రపంచకప్‌లో ఆడిన ఇంగ్లండ్‌ సీనియర్‌ స్టార్‌ క్రికెటర్‌ జో రూట్‌ మళ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలలో భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో... ఆ తర్వాత పాకిస్తాన్‌లో జరిగే చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనే ఇంగ్లండ్‌ జట్టును ఆదివారం ప్రకటించారు. భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పోటీపడే ఇంగ్లండ్‌ జట్టును కూడా ఎంపిక చేశారు. 

ఈ రెండు ఫార్మాట్‌లలో ఇంగ్లండ్‌ జట్టుకు వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌ నాయకత్వం వహిస్తాడు. టెస్టు ఫార్మాట్‌లో ఈ ఏడాదిని వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌తో ముగించనున్న రూట్‌ చివరి వన్డే 2023 ప్రపంచకప్‌లో ఆడాడు. 33 ఏళ్ల రూట్‌ ఇప్పటి వరకు 171 వన్డేలు ఆడి 6522 పరుగులు సాధించాడు. ఇందులో 16 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. పార్ట్‌టైమ్‌ ఆఫ్‌ స్పిన్‌ వేసే రూట్‌ వన్డేల్లో 27 వికెట్లు కూడా పడగొట్టాడు. 

మరోవైపు ఇంగ్లండ్‌ టెస్టు జట్టు కెపె్టన్, ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ భారత్‌తో జరిగే సిరీస్‌కు, చాంపియన్స్‌ ట్రోఫీకి దూరం కానున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ సందర్భంగా స్టోక్స్‌కు తొడ కండరాల గాయం తిరగబెట్టింది. ప్రస్తుతం స్టోక్స్‌ ఈ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఫలితంగా అతని పేరును సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు.  

ఇంగ్లండ్‌ వన్డే జట్టు: జోస్‌ బట్లర్‌ (కెప్టెన్‌), జోఫ్రా ఆర్చర్, అట్కిన్‌సన్, జేకబ్‌ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్‌ కార్స్, బెన్‌ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లివింగ్‌స్టోన్, ఆదిల్‌ రషీద్, జో రూట్, సాకిబ్‌ మహమూద్, ఫిల్‌ సాల్ట్, మార్క్‌ వుడ్‌. 
ఇంగ్లండ్‌ టి20 జట్టు: జోస్‌ బట్లర్‌ (కెప్టెన్‌), రెహాన్‌ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, అట్కిన్‌సన్, జేకబ్‌ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్‌ కార్స్, బెన్‌ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లివింగ్‌స్టోన్, ఆదిల్‌ రషీద్, సాకిబ్‌ మహమూద్, ఫిల్‌ సాల్ట్, మార్క్‌ వుడ్‌.

భారత్‌–ఇంగ్లండ్‌ టి20 సిరీస్‌ షెడ్యూల్‌ 
జనవరి 22: తొలి టి20 (కోల్‌కతాలో) 
జనవరి 25: రెండో టి20 (చెన్నైలో) 
జనవరి 28: మూడో టి20 (రాజ్‌కోట్‌లో) 
జనవరి 31: నాలుగో టి20 (పుణేలో) 
ఫిబ్రవరి 2: ఐదో టి20 (ముంబైలో) 

భారత్‌–ఇంగ్లండ్‌ వన్డే సిరీస్‌ షెడ్యూల్‌ 
ఫిబ్రవరి 6: తొలి వన్డే (నాగ్‌పూర్‌లో) 
ఫిబ్రవరి 9: రెండో వన్డే (కటక్‌లో) 
ఫిబ్రవరి 12: మూడో వన్డే (అహ్మదాబాద్‌లో) 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)