Breaking News

స్టోక్స్‌, ఆర్చర్ విరోచిత పోరాటం​.. ఇంగ్లండ్ ఆలౌట్‌

Published on Fri, 12/19/2025 - 07:37

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 213/8 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగుల వద్ద ఆలౌటైంది.

టాపార్డర్ విఫలమైనప్పటికి.. కెప్టెన్ బెన్ స్టోక్స్ (198 బంతుల్లో 83), లోయార్డర్ బ్యాటర్ జోఫ్రా ఆర్చర్‌(105 బంతుల్లో 51) విరోచిత పోరాటం కనబరిచారు.  ‘బాజ్‌బాల్‌’ ఆటతీరును పక్కన పెట్టిన స్టోక్స్‌... సంప్రదాయ టెస్టు క్రికెట్‌ ఫార్మాట్‌లో ఓవర్లకు ఓవర్లు క్రీజులో పాతుకుపోయి బ్యాటింగ్‌ చేశాడు.

ఈ క్రమంలో బ్రూక్‌తో ఐదో వికెట్‌కు 56 పరుగులు జోడించిన స్టోక్స్‌... తొమ్మిదో వికెట్‌కు ఆర్చర్‌తో 106 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆర్చర్ కూడా ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 85 పరుగులు వెనకబడింది.

శాంతించిన స్టార్క్‌..
గత రెండు మ్యాచ్‌ల్లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు దక్కించుకున్న మిచెల్‌ స్టార్క్‌ ఈసారి కాస్త శాంతించగా... ఆసీస్ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌, స్కాట్‌ బోలాండ్ తలా  3 వికెట్లతో సత్తా చాటారు. నాథన్‌ లయన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో ఆ్రస్టేలియా బౌలర్‌గా లయన్‌ నిలిచాడు. 

పేస్‌ దిగ్గజం మెక్‌గ్రాత్‌ను అతడు అధిగమించాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 326/8తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆ్రస్టేలియా... చివరకు 91.2 ఓవర్లలో 371 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ స్టార్క్‌ (75 బంతుల్లో 54; 9 ఫోర్లు) హాఫ్‌సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 5 వికెట్లు పడగొట్టగా... కార్స్, జాక్స్‌ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
చదవండి: సమమా... సొంతమా!
 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)