బామ్మ కోరిక నెరవేర్చిన ఆర్సీబీ స్టార్‌

Published on Mon, 06/09/2025 - 09:26

ఆర్సీబీ స్టార్‌ బ్యాటర్‌, ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ జేకబ్‌ బేతెల్‌ ఓ ముసలి మహిళా అభిమాని కోరిక తీర్చాడు. వెస్టిండీస్‌తో నిన్న (జూన్‌ 8) జరిగిన రెండో టీ20 సందర్భంగా ఓ యువకుడు తన బామ్మ కోసం ఓ సిక్స్‌ కొట్టాలని బేతెల్‌ను కోరాడు. అడిగిందే తడువుగా బేతెల్‌ ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో (రెండో బంతి) సిక్సర్‌ కొట్టి బామ్మ కోరిక నెరవేర్చాడు. 

అల్జరీ జోసఫ్‌ వేసిన ఆ ఓవర్‌లో అంతకుముందు బంతికి కూడా బేతెల్‌ సిక్సర్‌ బాదాడు. అదే ఓవర్‌లో ఐదో బంతిని కూడా సిక్సర్‌గా మలిచిన బేతెల్‌, చివరి బంతికి ఔట్‌ కావడం కొసమెరుపు. ఈ మ్యాచ్‌లో బేతెల్‌ ఆడిన ఇన్నింగ్స్‌ ఛేదనలో ఇంగ్లండ్‌ గెలుపుకు దోహదపడింది. ఈ ఇన్నింగ్స్‌లో బేతెల్‌ 10 బంతులు ఆడి 3 సిక్సర్లు, బౌండరీ సాయంతో 26 పరుగులు చేశాడు. తద్వారా విండీస్‌ నిర్ధేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ మరో 9 బంతులు మిగిలుండగానే ఛేదించింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. జాన్సన్‌ ఛార్లెస్‌ (47), షాయ్‌ హోప్‌ (49) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. ఇన్నింగ్స్‌ చివర్లో రోవ్‌మన్‌ పావెల్‌ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రొమారియో షెపర్డ్‌ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), జేసన్‌ హోల్డర్‌ (9 బంతుల్లో 29 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రోస్టన్‌ ఛేజ్‌ (1 బంతిలో 6 పరుగులు (నాటౌట్‌)) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.

పావెల్‌, షెపర్డ్‌, హోల్డర్‌, ఛేజ్‌ విజృంభించడంతో విండీస్‌ చివరి 4 ఓవర్లలో ఏకంగా 75 పరుగులు చేసింది. ఆదిల్‌ రషీద్‌ వేసిన 19 ఓవర్లో హోల్డర్‌, షెపర్డ్‌ ఊచకోత కోశారు. ఈ ఓవర్‌లో ఇరువురు కలిసి 5 సిక్సర్లు బాదారు. ఫలితంగా ఆ ఓవర్‌లో 31 పరుగులు వచ్చాయి. అంతకుముందు 17 ఓవర్లో 20, 18వ ఓవర్‌లో 8, ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి.

అనంతరం 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 18.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి గెలిచింది. బెన్‌ డకెట్‌ (18 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్‌), జోస్‌ బట్లర్‌ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), హ్యారీ బ్రూక్‌ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), బేతెల్‌ (10 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు), టామ్‌ బాంటన్‌ (11 బంతుల్లో 30 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించి ఇంగ్లండ్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. 

ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌లు సిరీస్‌ను ఇంగ్లండ్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో చేజిక్కించుకుంది. సిరీస్‌లోని చివరిదైన మూడో టీ20 మంగళవారం సౌతాంప్టన్‌లో జరుగుతుంది.   
 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)