పోప్‌ భారీ శతకం.. 325 పరుగులకు ఆలౌటైన ఇంగ్లండ్‌

Published on Sat, 09/07/2024 - 18:27

శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. 221/3 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆతిథ్య జట్టు.. ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో 104 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. తొలి రోజే సెంచరీ చేసిన ఓలీ పోప్‌ 154 పరుగులు చేసి ఔట్‌ కాగా.. మరో ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ 19 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇంగ్లండ్‌ తమ చివరి ఆరు వికెట్లు కేవలం 64 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. 

ఓవర్‌నైట్‌ స్కోర్‌కు 40 పరుగులు జోడించాక బ్రూక్‌ ఐదో వికెట్‌గా వెనుదిరగగా.. ఓలీ పోప్‌ ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో బెన్‌ డకెట్‌ 86, డాన్‌ లారెన్స్‌ 5, జో రూట్‌ 13, జేమీ స్మిత్‌ 16, క్రిస్‌ వోక్స్‌ 2, గస్‌ అట్కిన్సన్‌ 5, ఓల్లీ స్టోన్‌ 15 (నాటౌట్‌), జోష్‌ హల్‌ 2, షోయబ్‌ బషీర్‌ ఒక్క పరుగు చేశారు. 

శ్రీలంక బౌలర్లలో మిలన్‌ రత్నాయకే 3 వికెట్లు పడగొట్టగా.. విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార, ధనంజయ డిసిల్వ తలో 2, అశిత ఫెర్నాండో ఓ వికెట్‌ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక రెండో రోజు లంచ్‌ విరామం సమయానికి వికెట్‌ నష్టపోకుండా ఒక్క పరుగు చేసింది. పథుమ్‌ నిస్సంక  (1), దిముత్‌ కరుణరత్నే క్రీజ్‌లో ఉన్నారు. 

కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం శ్రీలంక జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన ఇంగ్లండ్‌ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)