Breaking News

ENG VS NZ 2nd ODI: ఇదెక్కడి క్యాచ్‌ రా సామీ.. ఫ్యూజులు ఎగిరిపోయాయి..!

Published on Mon, 09/11/2023 - 16:23

సౌథాంప్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య నిన్న (సెప్టెంబర్‌ 10) జరిగిన రెండో వన్డేలో రెండు అద్భుతమైన క్యాచ్‌లు అభిమానులకు కనువిందు చేశాయి. ఇందులో మొదటిది బౌల్ట్‌ బౌలింగ్‌లో సాంట్నర్‌ పట్టగా (బెయిర్‌స్టో).. రెండోది సౌథీ బౌలింగ్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (మొయిన్‌ అలీ) అందున్నాడు. సాంట్నర్‌ గాల్లోకి పైకి ఎగురుతూ ఒంటిచేత్తో పట్టుకున్న క్యాచ్‌ అద్భుతమైతే.. అసాధ్యమైన క్యాచ్‌ను పట్టుకున్న ఫిలిప్స్‌ అత్యద్భుతం.

మొయిన్‌ అలీ బ్యాట్‌ లీడింగ్‌ ఎడ్జ్‌ తీసుకుని బంతి గాల్లోకి లేవగా, చాలా దూరం నుంచి పరిగెడుతూ వచ్చి గాల్లోకి డైవ్‌ చేస్తూ ఫిలిప్స్‌ ఈ క్యాచ్‌ను అందకున్నాడు. రిస్క్‌తో కూడుకున్న ఈ క్యాచ్‌ను పట్టుకుని ఫిలిప్స్‌ పెద్ద సాహసమే చేశాడు. క్యాచ్‌ పట్టే క్రమంలో ఒకవేళ అటుఇటు అయివుంటే అతను తీవ్రంగా గాయపడేవాడు. అయితే ఫిలిప్స్‌ ఎంతో చాకచక్యంగా, ఎలాంటి దెబ్బలు తగిలించుకోకుండా ఈ ​క్యాచ్‌ను అందుకుని అందరి మన్ననలు అందుకున్నాడు.

ఈ రెండు క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి. నెటిజన్లు సాంట్నర్‌ క్యాచ్‌తో పోలిస్తే ఫిలిప్స్‌ క్యాచ్‌కు ఎక్కువగా ఫిదా అవుతున్నారు. వారు ఫిలిప్స్‌ను ఫ్లయింగ్‌ బర్డ్‌తో పోలుస్తున్నారు. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఫీల్డర్లు అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నా, ఆ జట్టు మాత్రం 79 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. లివింగ్‌స్టోన్‌ (95 నాటౌట్‌) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. కివీస్‌ బౌలర్లు బౌల్ట్‌ 3, సౌథీ 2, హెన్రీ, సాంట్నర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 227 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్‌.. ఇంగ్లీష్‌ బౌలర్లు డేవిడ్‌ విల్లే (3/34), రీస్‌ టాప్లే (3/27), మొయిన్‌ అలీ (2/30), అట్కిన్సన్‌ (1/23) ధాటికి 26.5 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. కివీస్‌ ఇన్నింగ్స్‌లో డారిల్‌ మిచెల్‌ (57) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)