Breaking News

శతక్కొట్టిన బ్రూక్‌.. సెంచరీకి చేరువలో రూట్‌.. గెలుపు దిశగా ఇంగ్లండ్‌

Published on Sun, 08/03/2025 - 20:40

భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ గెలుపు దిశగా సాగుతోంది. 374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ నాలుగో రోజు టీ విరామం సమయానికి 4 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసి, లక్ష్యానికి మరో 57 పరుగుల దూరంలో ఉంది.

హ్యారీ బ్రూక్‌ (98 బంతుల్లో 111; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర శతకం బాది ఇంగ్లండ్‌ గెలుపుకు గట్టి పునాది వేయగా.. రూట్‌ (98 నాటౌట్‌) సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉన్నాడు. రూట్‌కు జతగా జేకబ్‌ బేతెల్‌ (1) క్రీజ్‌లో ఉన్నాడు.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో క్రాలే (14), డకెట్‌ (54), ఓలీ పోప్‌ (27), బ్రూక్‌ (111) ఔటయ్యారు. భారత బౌలర్లలో సిరాజ్‌ 2, ప్రసిద్ద్‌ కృష్ణ, ఆకాశ్‌దీప్‌ తలో వికెట్‌ తీశారు. 

ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే మరో 5 వికెట్లు (గాయం కారణంగా వోక్స్‌ మ్యాచ్‌ నుంచి వైదొలిగాడు) తీయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యంగా కనిపిస్తుంది. ఏదైన అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌ల భారత్‌ గెలవలేదు. ఈ మ్యాచ్‌లో ఓడితే భారత్‌ సిరీస్‌ను కూడా కోల్పోతుంది (1-3లో).

అంతకుముందు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్‌ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్‌ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్‌ సుందర్‌ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోష్‌ టంగ్‌ 5 వికెట్లు తీశాడు.

దీనికి ముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్‌ క్రాలే (64), హ్యారీ బ్రూక్‌ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్‌ నాయర్‌ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అట్కిన్సన్‌ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ 1-2తో వెనుకపడి ఉంది.

 

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)