Breaking News

గాయాన్ని సైతం లెక్క చేయకుండా ఆడి చరిత్ర సృష్టించిన రిషబ్‌ పంత్‌

Published on Thu, 07/24/2025 - 18:59

మాంచెస్టర్‌ టెస్ట్‌లో టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో గాయాన్ని సైతం​ లెక్క చేయకుండా బరిలోకి దిగిన పంత్‌.. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు (67 ఇన్నింగ్స్‌ల్లో 2719 పరుగులు) చేసిన భారత ఆటగాడిగా అవతరించాడు. 

ఈ రికార్డు ఇంతకుముందు రోహిత్‌ శర్మ (69 ఇన్నింగ్స్‌ల్లో 2716 పరుగులు) పేరిట ఉండేది. పంత్‌ తాజాగా హిట్‌మ్యాన్‌ రికార్డును బద్దలు కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో పంత్‌ 54 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు. తొలి రోజు ఆటలో 37 పరుగుల వద్ద రిటైర్డ్‌ హర్ట్‌ అయిన పంత్‌.. మరో 17 పరుగులు జోడించి పెవిలియన్‌కు చేరాడు. బొటన వేలు గాయంతో బాధపడుతూనే పంత్‌ ఆడిన ఈ ఇన్నింగ్స్‌ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. పంత్‌ వీరోచిత పోరాటానికి అందరూ సలాం​ కొడుతున్నారు. 

పంత్‌ హాఫ్‌ సెంచరీకి చేరువలో జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో బాదిన ఓ సిక్సర్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఈ సిక్సర్‌తో పంత్‌ భారత్‌ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్‌ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం పంత్‌, సెహ్వాగ్‌ టెస్ట్‌ల్లో తలో 90 సిక్సర్లతో ఉన్నారు.

హాఫ్‌ సెంచరీ పూర్తి కాగానే పంత్‌ జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. పంత్‌ ఔటయ్యాక భారత్‌ ఇన్నింగ్స్‌ కొద్ది క్షణాల్లోనే ముగిసింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసింది.

భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 58, కేఎల్‌ రాహుల్‌ 46, సాయి సుదర్శన్‌ 61, శుభ్‌మన్‌ గిల్‌ 12, రిషబ్‌ పంత్‌ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్‌ ఠాకూర్‌ 41, వాషింగ్టన్‌ సుందర్‌ 27, అన్షుల్‌ కంబోజ్‌ 0, జస్ప్రీత్‌ బుమ్రా 5, మహ్మద్‌ సిరాజ్‌ 5 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్టోక్స్‌ 5, ఆర్చర్‌ 3, వోక్స్‌ డాసన్‌ తలో వికెట్‌ తీశారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్‌ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)