Breaking News

ENG Vs IND 2nd Test Day 5: గుడ్‌ న్యూస్‌.. ఆట మొదలైంది.. అయితే..!

Published on Sun, 07/06/2025 - 17:17

ఎడ్జ్‌బాస్టన్‌ నుంచి టీమిండియా అభిమానులకు గుడ్‌ న్యూస్‌ తెలుస్తుంది. చివరి రోజు ఆట ప్రారంభానికి ముందు ఆటంకం కలిగించిన వరుణుడు ప్రస్తుతం శాంతించాడు. వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో మైదానంలో కప్పి ఉంచిన కవర్లను తొలగించారు. ఔట్‌ ఫీల్డ్‌ను వేగంగా డ్రై చేశారు. సూర్యుడు మేఘాలను ముసుగు నుంచి బయటికి వచ్చాడు.

అయితే ఓవర్ల కోత మాత్రం తప్పలేదు. ఇవాల్టి ఆటలో 90 కాకుండా 80 ఓవర్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. వర్షం కారణంగా 10 ఓవర్ల కోత పడింది. భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌.. దాదాపు 2 గంటలు ఆలస్యంగా భారతకాలమానం ప్రకారం సాయంత్రం 5:10 గంటలకు ప్రారంభమయ్యింది.

సవరించిన సెషన్‌ టైమింగ్స్‌ను కూడా అంపైర్లు ప్రకటించారు. తొలి సెషన్‌ 5:10 నుంచి 7 గంటల వరకు.. రెండో సెషన్‌ 7:40 నుంచి 9:40 వరకు.. మూడో సెషన్‌ రాత్రి 10 గంటల నుంచి 11:30 గంటల వరకు జరుగనుంది.

కాగా, ఈ మ్యాచ్‌లో భారత్‌ చారిత్రక గెలుపుకు 7 వికెట్ల దూరంలో ఉంది. ఇంగ్లండ్‌.. భారత్‌ నిర్దేశించిన 608 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.

నాలుగో రోజు ఆటలో టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను డిక్లేర్ చేసింది.  శుభ్‌‌‌‌‌‌‌‌మన్ గిల్ (162 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచ‌రీతో చెల‌రేగ‌గా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్‌‌), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచ‌రీలతో రాణించారు.

మరోవైపు టీమిండియా ఎడ్జ్‌బాస్టన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. ఈ మ్యాచ్‌లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా ఆటగాళ్లు ఆరాటపడుతున్నారు.

స్కోర్‌ వివరాలు..
భారత్‌ 587 & 427/6 డిక్లేర్‌
ఇంగ్లండ్‌ 407 & 72/3 (16)  ప్రస్తుత రన్‌రేట్‌: 4.5

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)