Breaking News

ఇంగ్లండ్‌ హ్యాట్రిక్‌.. ముగ్గురూ క్లీన్‌ బౌల్డ్‌

Published on Thu, 09/12/2024 - 14:37

ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టు 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. ట్రావిస్‌ హెడ్‌ (23 బంతుల్లో 59; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఊచకోత కోయడంతో 19.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్‌ (41), జోష్‌ ఇంగ్లిస్‌ (37) ఓ మోస్తరు పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో లివింగ్‌స్టోన్‌ 3, జోఫ్రా ఆర్చర్‌, సకీబ్‌ మహమూద్‌ తలో 2, సామ్‌ కర్రన్‌, ఆదిల్‌ రషీద్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్‌
180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. ఆసీస్‌ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 19.2 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. సీన్‌ అబాట్‌ 3, హాజిల్‌వుడ్‌, జంపా చెరో 2, బార్ట్‌లెట్‌, గ్రీన్‌, స్టోయినిస్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో లివింగ్‌స్టోన్‌ (37), ఫిలిప్‌ సాల్ట్‌ (20), సామ్‌ కర్రన్‌(18), జోర్డన్‌ కాక్స్‌ (17), జేమీ ఓవర్టన్‌ (15), సాకిబ్‌ మహమూద్‌ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 సెప్టెంబర్‌ 13న జరుగుతుంది.

ఇంగ్లండ్‌ హ్యాట్రిక్‌
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టీమ్‌ హ్యాట్రిక్‌ వికెట్లు తీసింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ చివరి రెండు బంతులకు.. 19వ తొలి బంతికి ఇంగ్లండ్‌ బౌలర్లు వికెట్లు తీశారు. 18వ ఓవర్‌లో సీన్‌ అబాట్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌లను జోఫ్రా ఆర్చర్‌.. 19వ ఓవర్‌ తొలి బంతికి కెమరూన్‌ గ్రీన్‌ను సాకిబ్‌ మహమూద్‌ ఔట్‌ చేశారు. ఈ ముగ్గురూ క్లీన్‌ బౌల్డ్‌ కావడం​ గమనార్హం. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓడినప్పటికీ ఇదొక్కటే చెప్పుకోదగ్గ ప్రదర్శన.

ట్రవిస్‌ హెడ్‌ ఊచకోత
ఆసీస్‌ ఆటగాడు ట్రావిస్‌ హెడ్‌ తన సహజ సిద్దమైన హిట్టింగ్‌తో ఇంగ్లండ్‌ బౌలర్లను భయపెట్టారు. హెడ్‌.. సామ్‌ కర్రన్‌ వేసిన ఓ ఓవర్‌లో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. ఇందులో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. హెడ్‌.. ఆసీస్‌ తరఫున అంత‌ర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవ‌ర్‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. హెడ్ కంటే ముందు పాంటింగ్‌, డేనియ‌ల్ క్రిస్టియ‌న్‌, ఆరోన్‌ ఫించ్‌, మిచెల్ మార్ష్ ఒకే ఓవ‌ర్‌లో 30 ప‌రుగులు బాదారు.

చదవండి: హెడ్ విధ్వంసం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్‌

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)