Breaking News

నిరాశపరిచిన ఆయుశ్‌ మాత్రే.. మరోసారి విధ్వంసం సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ

Published on Mon, 06/30/2025 - 18:44

14 ఏళ్ల భారత యువ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ఇంగ్లండ్‌ గడ్డపై మరోసారి రెచ్చిపోయాడు. ఇంగ్లండ్‌ అండర్‌ 19 జట్టుతో ఇవాళ (జూన్‌ 30) జరుగుతున్న మ్యాచ్‌లో మరో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలి వన్డేలో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిస వైభవ్‌.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. 

వైభవ్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అర్హమైన హాఫ్‌ సెంచరీలను మిస్‌ చేసుకున్నాడు. మరోవైపు వైభవ్‌తో పాటు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మరో ఐపీఎల్‌ సంచలన ఆయుశ్‌ మాత్రే ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. మాత్రే తానెదుర్కొన్న తొలి బంతికే డకౌటయ్యాడు (గోల్డెన్‌ డక్‌). మాత్రే వైభవ్‌ తరహాలో కాకపోయినా తొలి వన్డేలో పర్వాలేదనిపించాడు. ఆ మ్యాచ్‌లో అతను 30 బంతులు ఎదుర్కొని 4 ఫోర్ల సాయంతో 21 పరుగులు చేశాడు.

రెండో వన్డే విషయానికొస్తే.. ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అధికారికంగా తొలి బంతికే ఆయుశ్‌ మాత్రే (0) వికెట్‌ కోల్పోయిన భారత్‌.. ఆతర్వాత కుదురుకుంది. వైభవ్‌ సూర్యవంశీ (45), విహాన్‌ మల్హోత్రా (49), చవ్డా (22), అభిగ్యాన్‌ కుందు (32), రాహుల్‌ కుమార్‌ (47), కనిష్క్‌ చౌహాన్‌ (45) రాణించడంతో ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్‌ చేసింది. 

అయితే చివరి వరుస ఆటగాళ్లు వెంటవెంటనే ఔట్‌ కావడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ 49 ఓవర్లలో 290 పరుగుల వద్ద ముగిసింది (ఆలౌట్‌). ఇంగ్లండ్‌ బౌలర్లలో ఫ్రెంచ్‌ 4 వికెట్లు పడగొట్టగా..  జాక్‌ హోమ్‌, అలెక్స్‌ గ్రీన్‌ తలో 3 వికెట్లు తీశారు.    

కాగా, భారత అండర్‌-19 జట్టు 5 వన్డేలు, 2 టెస్ట్‌ మ్యాచ్‌ల కోసం  ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. నాటింగ్హమ్‌ వేదికగా ప్రస్తుతం రెండో వన్డే జరుగుతుండగా.. హోవ్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఇంగ్లండ్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 42.2 ఓవర్లలో 174 పరుగులకే కుప్పకూలగా.. భారత్‌ కేవలం 24 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ పర్యటనలో భారత జట్టుకు ఆయుశ్‌ మాత్రే సారథ్యం వహిస్తున్నాడు. 
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)