శిఖర్‌ ధవన్‌కు ఈడీ నోటీసులు

Published on Thu, 09/04/2025 - 11:34

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్‌ శిఖర్‌ ధవన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ED) గురువారం (సెప్టెంబర్ 4, 2025) నోటీసులు జారీ చేసింది. ఈ కేసు నిమిత్తం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 1xBet అనే అక్రమ బెట్టింగ్‌ యాప్‌కు ధవన్ ప్రమోషనల్ ఎండార్స్‌మెంట్ ఇచ్చినట్లు ఈడీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈడీ అధికారులు ధవన్‌ను Prevention of Money Laundering Act (PMLA) కింద విచారించనున్నారు. ఇదే కేసులో మరో టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేష్ రైనా ఇదివరకే విచారణకు హాజరయ్యాడు. రానా దగ్గుబాటి, విజయ్‌ దేవరకొండ, ప్రకాశ్‌ రాజ్‌ వంటి సినీ ప్రముఖులు కూడా ఈ కేసులో విచారణకు ఎదుర్కొన్నారు.

ఇదే కేసులో గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. వీరి ప్లాట్‌ఫాంలలో బెట్టింగ్ యాప్స్‌కి ప్రాధాన్యత ఇచ్చారని ఈడీ అభిప్రాయడుతుంది.

కాగా, ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌లు కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతూ, పన్నుల ఎగ్గొడుతూ, యువతపై దుష్ప్రభావం చూపుతున్నాయనన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రియల్ మనీ గేమింగ్‌పై నిషేధం విధించింది. 

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా నల్లధనం, హవాలా లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సెలబ్రిటీలు యాప్‌లను ప్రచారం చేయడం ద్వారా సామాన్య ప్రజలు ప్రభావితం అవుతున్నారని, కొందరు ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేంద్ర భావిస్తుంది. 
 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)