Breaking News

అనంతపురంలో ఆడటం సంతోషంగా ఉంది: శ్రేయస్‌ అయ్యర్‌

Published on Wed, 09/04/2024 - 16:34

దేశవాళీ క్రికెట్లో పాల్గొనటం ద్వారా నైపుణ్యాలను మరింతగా పెంచుకోవచ్చని టీమిండియా స్టార్‌ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ అన్నారు. జాతీయ జట్టుకు ఆడుతున్న క్రికెటర్లు ఈ టోర్నీల్లో ఆడటం వల్ల యువతలో స్ఫూర్తినింపినట్లు అవుతుందని పేర్కొన్నారు. 

కాగా జాతీయ విధుల నుంచి విరామం లభించినపుడు.. ఫిట్‌గా ఉన్న సెంట్రల్‌ కాంట్రాక్టు ఆటగాళ్లంతా డొమెస్టిక్‌ క్రికెట్‌ ఆడాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్‌ ట్రోఫీ-2024లో శ్రేయస్‌ అయ్యర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, రిషభ్‌ పంత్‌, శుబ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌ తదితర టీమిండియా స్టార్లు పాల్గొనున్నారు. 

ఇండియా-ఏ, ఇండియా-బి- ఇండియా-సి, ఇండియా-డి జట్ల తరఫున ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. ఈ రెడ్‌బాల్‌ టోర్నీ పోటీలు అనంతపురం వేదికగా గురువారం ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే క్రికెటర్లంతా అక్కడికి చేరుకుని ప్రాక్టీస్‌ కూడా మొదలుపెట్టారు.

ఈ క్రమంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇండియా-సి కెప్టెన్‌ రుతురాజ్ గైక్వాడ్, ఇండియా-డి కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అనంతపురం లో జరిగే దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో ఆడుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ ఫోర్‌-డే టోర్నీలో ఆడటం ద్వారా నైపుణ్యాలను పదునుపెట్టుకునే అవకాశం దొరుకుతుందని హర్షం వ్యక్తం చేశారు.

దులిప్‌ ట్రోఫీ- 2024 జట్లు
ఇండియా-ఏ
శుబ్‌మన్‌ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనూష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుషాగ్రా, శస్వత్ రావత్.

ఇండియా-బి
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీశ్‌ కుమార్ రెడ్డి*, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, యశ్ దయాళ్, ముకేష్ కుమార్, రాహుల్ చహర్, ఆర్. సాయి కిషోర్, మోహిత్ అవస్థి, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్).

ఇండియా-సి
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్.

ఇండియా-డి
శ్రేయస్ అయ్యర్‌(కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రికీ భుయ్, శరణ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సేన్‌గుప్తా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్.

చదవండి: సెంచరీ హీరో’కు గాయం.. సంజూ శాంసన్‌కు లక్కీ ఛాన్స్‌!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)