Breaking News

చరిత్ర సృష్టించాడు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌, కెప్టెన్‌గా రికార్డు

Published on Mon, 06/30/2025 - 12:58

సౌతాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ (Faf Du Plesis) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో ఇంత వరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. నలభై ఏళ్ల వయసు దాటిన తర్వాత.. పొట్టి ఫార్మాట్లో రెండు శతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. మేజర్‌ లీగ్‌ క్రికెట్‌-2025లో భాగంగా డుప్లెసిస్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

ఎంఎల్‌సీ-2025 (MLC)లో డుప్లెసిస్‌ టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం డల్లాస్‌లో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ కింగ్స్‌.. ఎంఐ న్యూయార్క్‌ జట్టుతో తలపడింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్ల నష్టానికి 223 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.

రెండు శతకాలు
ఓపెనర్‌ డుప్లెసిస్‌ శతక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మొత్తంగా 53 బంతుల్లో ఐదు ఫోర్లు, తొమ్మిది సిక్స్‌ల సాయంతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే డుప్లెసిస్‌ ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. నలభైవ పడిలో అడుగుపెట్టిన తర్వాత డుప్లెసిస్‌కు ఇది రెండో టీ20 సెంచరీ.

ఎంఎల్‌సీలో భాగంగా ఇటీవల శాన్‌ ఫ్రాన్సిస్కో జట్టుపై డుప్లెసిస్‌ 100 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో నలభై ఏళ్లు దాటిన తర్వాత రెండు టీ20 శతకాలు బాదిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ వయసులోనూ ఫిట్‌గా ఉంటూ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడటమే గాక.. సెంచరీలతో అలరిస్తూ యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ సౌతాఫ్రికా దిగ్గజం.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. డుప్లెసిస్‌తో పాటు డొనోవాన్‌ ఫెరీరా (20 బంతుల్లో 53) రాణించడంతో సూపర్‌ కింగ్స్‌ 223 పరుగుల చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో ఎంఐ న్యూయార్క్‌ జట్టు ఆరంభం నుంచే తడబడింది. సూపర్‌ కింగ్స్‌ బౌలర్ల దెబ్బకు 184 పరుగులకే పరిమితమైంది. ఎంఐ బ్యాటర్లలో కీరన్‌ పొలార్డ్‌ (70) ఒక్కడే మెరుగ్గా ఆడాడు. సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో మూడు కీలక వికెట్లు తీసిన అకీల్‌ హొసేన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకోగా.. నండ్రీ బర్గర్‌, మార్కస్‌ స్టొయినిస్‌ రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

నలభై ఏళ్లు దాటిన తర్వాత టీ20 ఫార్మాట్లో శతకాలు బాదింది వీరే..
ఫాఫ్‌ డుప్లెసిస్‌- 43 ఇన్నింగ్స్‌లో- రెండు శతకాలు
జుబేర్‌ అహ్మద్‌- 4 ఇన్నింగ్స్‌లో- ఒక శతకం
ఇమ్రాన్‌ జనత్‌- 15 ఇన్నింగ్స్‌లో- ఒక శతకం
గ్రాహమ్‌ హిక్‌- 23 ఇన్నింగ్స్‌లో- ఒక శతకం
పాల్‌ కాలింగ్‌వుడ్‌- 29 ఇన్నింగ్స్‌లో- ఒక శతకం.

బాబర్‌ ప్రపంచ రికార్డు బద్దలు
ఇక రికార్డుతో పాటు మరో ఘనతను కూడా డుప్లెసిస్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. కెప్టెన్‌గా టీ20లలో అతడికి ఇది ఎనిమిదో సెంచరీ. ఈ క్రమంలో మైకేల్‌ క్లింగర్‌ (7 శతకాలు), బాబర్‌ ఆజం (7 శతకాలు) పేరిట ఉన్న సంయుక్త వరల్డ్‌ రికార్డును బద్దలుకొట్టాడు. అంతేకాదు మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో అత్యధికంగా మూడు శతకాలు బాదిన క్రికెటర్‌గానూ డుప్లెసిస్‌ నిలిచాడు.

చదవండి: ఒక్కడిపైనే ఆధారపడొద్దు.. రెండో టెస్టులో అతడిని తప్పక ఆడించండి: అజారుద్దీన్‌

Videos

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు