Breaking News

హారికపై గెలుపుతో సెమీస్‌లో దివ్య

Published on Tue, 07/22/2025 - 06:25

బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన అంతర్జాతీయ మాస్టర్‌ (ఐఎం), జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌ దివ్య దేశ్‌ముఖ్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారికతో సోమవారం జరిగిన టైబ్రేక్‌లో మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల దివ్య 2–0తో విజయం సాధించింది. ఈ ఇద్దరి మధ్య ఆదివారం నిరీ్ణత రెండు గేమ్‌లు ముగిశాక స్కోరు 1–1తో సమంగా ఉండటంతో... విజేతను నిర్ణయించేందుకు సోమవారం టైబ్రేక్‌ నిర్వహించారు. తొలి గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన దివ్య 57 ఎత్తుల్లో గెలిచింది. 

సెమీస్‌ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచి్చతంగా గెలవాల్సిన రెండో గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన హారిక 76 ఎత్తుల్లో ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. నేడు జరిగే సెమీఫైనల్స్‌ తొలి గేమ్‌లలో టింగ్‌జీ లె (చైనా)తో భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి; టాన్‌ జోంగి (చైనా)తో దివ్య తలపడతారు. భారత్‌ నుంచి ఇద్దరు ప్లేయర్లు సెమీఫైనల్‌ చేరుకోవడంతో ఒక పతకం ఖాయమైంది. అంతేకాకుండా వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్‌ టోర్నీకి కూడా భారత్‌కు ఒక బెర్త్‌ ఖరారైంది. ప్రపంచకప్‌ టోర్నీలో టాప్‌–3లో నిలిచిన ప్లేయర్లు ప్రపంచ చాంపియన్‌ ప్రత్యరి్థని నిర్ణయించే క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత పొందుతారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)