Breaking News

దినేశ్‌ కార్తీక్‌కు మరో కీలక పదవి

Published on Wed, 12/10/2025 - 14:58

టీమిండియా మాజీ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తీక్‌కు మరో కీలక పదవి దక్కింది. ద హండ్రెడ్‌ లీగ్‌ 2026 సీజన్‌ కోసం పురుషుల లండన్‌ స్పిరిట్‌ ఫ్రాంచైజీకి బ్యాటింగ్‌ కోచ్‌ మరియు మెంటర్‌గా ఎంపికయ్యాడు. హండ్రెడ్‌ లీగ్‌లో డీకే ఏ ఫ్రాంచైజీతో అయిన పని చేయడం (కోచ్‌గా) ఇదే మొదటిసారి.

డీకే 2025 ఐపీఎల్‌ సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో బ్యాటింగ్ కోచ్ మరియు మెంటర్‌గా చేరి, ఆ జట్టు మొదటి సారి ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే పోర్ట్‌ఫోలియోతో లండన్‌ స్పిరిట్‌తోనూ జతకట్టాడు.

లండన్ స్పిరిట్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్  మో బోబాట్ (ఆర్సీబీ డైరెక్టర్ కూడా) డీకేను స్వాగతిస్తూ.. ఈ టీ20 ఫార్మాట్‌ స్పెషలిస్ట్‌ లండన్‌ స్పిరిట్‌లో చేరడం ఆనందకరం. అతని ఆలోచన విధానం ప్రత్యేకం. పొట్టి ఫార్మాట్లో డీకేకు ఉన్న అనుభవం, అతని ఉత్సాహం మా ఆటగాళ్లకు అమూల్యమవుతుందని అన్నారు.  

లండన్‌ స్పిరిట్‌తో ఒప్పందం అనంతరం డీకే భావోద్వేగానికి లోనయ్యాడు. లార్డ్స్‌లో ఇంగ్లీష్ సమ్మర్ గడపనుండటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదే గ్రౌండ్‌లో నేను భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడాను. చివరి టెస్ట్ కూడా ఇక్కడే ఆడాను. లండన్ స్పిరిట్‌తో కొత్త ప్రయాణం ప్రారంభించడం చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుందని అన్నాడు.  

40 ఏళ్ల దినేశ్‌ కార్తీక్‌ భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అలాగే ఐపీఎల్‌లో ప్రారంభ సీజన్‌ (2008) నుంచి 2024 ఎడిషన్‌ వరకు ఆడాడు. ఈ మధ్యలో అతను వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 257 మ్యాచ్‌లు ఆడాడు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)