Breaking News

IPL 2024: లేటు వయస్సులో డీకే ఖతర్నాక్ ఇన్నింగ్స్‌.. ! వీడియో వైర‌ల్‌

Published on Sat, 03/23/2024 - 06:30

ఐపీఎల్‌-2024 తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కార్తీక్ అదరగొట్టాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన డీకే.. తన ఖాతార్నాక్ ఇన్నింగ్స్‌తో జట్టును అదుకున్నాడు. మరో యువ ఆటగాడు అనుజ్ రావత్‌తో కలిసి తన జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్‌ను అందించాడు. ఆరో వికెట్‌కు రావత్‌తో కలిసి 95 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.  

ఓవరాల్‌గా 26 బంతులు ఎదుర్కొన్న కార్తీక్‌.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. 38 ఏళ్ల కార్తీక్ కొట్టిన 2 సిక్సర్ల కూడా మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా ఈ ఏడాది సీజన్ తర్వాత ఐపీఎల్‌కు కార్తీక్ గుడ్‌బై చేప్పే అవకాశముంది. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18. 4 ఓవర్లలో ఛేదించింది. సీఎస్‌కే బ్యాటర్లలో రచిన్‌ రవీంద్ర(37) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. శివమ్‌ దూబే(34 నాటౌట్‌), రవీంద్ర జడేజా(25 నాటౌట్‌) రాణించారు.

ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కార్తీక్‌తో పాటు  అనుజ్‌ రావత్‌(48) పరుగులతో రాణించాడు.  సీఎస్‌కే బౌలర్లలో ముస్తుఫిజర్‌ రెహ్మాన్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్ ఒక్క వికెట్ సాధించాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)