Breaking News

ఆల్‌ టైమ్ భారత టీ20 జట్టు.. సెహ్వాగ్‌, గౌతీకి నో ఛాన్స్‌! కెప్టెన్ ఎవ‌రంటే?

Published on Sat, 09/06/2025 - 16:27

భార‌త మాజీ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ దినేష్ కార్తీక్ ఆల్‌టైమ్ ఇండియా టీ20 ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను ఎంచుకున్నాడు. ఈ జ‌ట్టులో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, యువ‌రాజ్ సింగ్‌, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్,  హార్దిక్ పాండ్యాల వంటి స్టార్ క్రికెట‌ర్లకు కార్తీక్ చోటు ఇచ్చాడు.

అదేవిధంగా యువ ఆట‌గాడు అభిషేక్ శ‌ర్మ‌కు ఛాన్స్ ఇచ్చాడు.  ఈ జ‌ట్టు కెప్టెన్‌గా ధోనిని డికే ఎంపిక చేశాడు. కార్తీక్ ఇటీవ‌లే క్రిక్‌బ‌జ్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. ఈ సంద‌ర్భంగా టీమిండియా ఆల్‌టైమ్ టీ20 ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను ఎంచుకోమ‌ని హోస్ట్ అడిగాడు.

"అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో గ‌త రెండేళ్ల‌గా దుమ్ములేపుతున్న ఆట‌గాడితో నా ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను ప్రారంభిస్తాను. అత‌డు యువ బ్యాట‌ర్ అభిషేక్ శ‌ర్మ‌. అభిషేక్‌కు అద్బుత‌మైన టాలెంట్ ఉంది.  భవిష్య‌త్తులో అత‌డు సూప‌ర్ స్టార్ అవుతాడు. టీ20 ఫార్మాట్‌కు అత‌డి స‌రిగ్గా సరిపోతాడు. 

అభి బంతితో కూడా రాణించ‌గ‌ల‌డు. నా జ‌ట్టులో అభిషేక్‌తో పాటు రోహిత్ శ‌ర్మ‌ను ఓపెన‌ర్ల‌గా ఎంచుకుంటాను. మూడు, నాలుగు స్ధానాల్లో కోహ్లి, సూర్య‌కు ఛాన్స్ ఇవ్వాల‌న‌కుంటున్నాను. ఐదో స్ధానంలో యువ‌రాజ్ సింగ్‌.. ఆల్‌రౌండ‌ర్ల‌గా హార్దిక్ పాండ్యా, అక్ష‌ర్ పటేల్‌కు చోటు ఇస్తాను. వికెట్ కీప‌ర్‌గా ధోనిని ఫిక్స్ చేస్తాను. 

అంతేకాకుండా నా ఆల్‌టైమ్ జ‌ట్టుకు ధోనినే కెప్టెన్‌. ఇక స్పెషలిస్ట్ స్పిన్న‌ర్‌గా వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తికి అవ‌కాశమిస్తాను. చివ‌ర‌గా ఫాస్ట్ బౌల‌ర్ల కోటాలో జ‌స్ప్రీత్ బుమ్రా, భువ‌నేశ్వ‌ర్‌కు కుమార్‌లకు ఛాన్స్ ఇస్తాన‌ని" కార్తీక్ పేర్కొన్నాడు. కాగా తొట్ట తొలి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ విన్నింగ్‌ జ‌ట్టులో భాగ‌మైన గౌత‌మ్ గంభీర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌లకు కార్తీక్ చోటు ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా వ‌ర‌ల్డ్ టీ20 నంబ‌ర్ వ‌న్ బౌల‌ర్ అర్ష్‌దీప్‌ను కూడా డికే ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు.

కార్తీక్ ఎంచుకున్న ఆల్‌టైమ్ భార‌త టీ20 ప్లేయింగ్ ఎలెవ‌న్‌
అభిషేక్ శర్మ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్యా, ఎంఎస్‌ ధోని (కెప్టెన్ అండ్ వికెట్ కీప‌ర్‌), అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్
చదవండి: భారత జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌.. బీసీసీఐ ప్రకటన

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)