Breaking News

చాలా సంతోషంగా ఉంది.. క్రెడిట్‌ మొత్తం వాళ్లకే! ఇంకా మెరుగవ్వాలి: బుమ్రా

Published on Sat, 08/19/2023 - 08:34

ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా గెలుపుతో ఆరంభించింది. ఈ సిరీస్‌లో భాగంగా శుక్రవారం డబ్లిన్‌ వేదికగా ఐరీష్‌తో జరిగిన తొలి టీ20లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో  2 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది. తద్వారా టీ20ల్లో భారత కెప్టెన్‌గా జస్ప్రీత్‌ బుమ్రా తొలి విజయాన్ని అందుకున్నాడు. ఐర్లాండ్‌ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

కెప్టెన్‌గానే కాకుండా బౌలర్‌గా కూడా బుమ్రా అదరగొట్టాడు. దాదాపు 11 నెలల తర్వాత మైదానంలో అడుగుపెట్టిన బుమ్రా.. రీఎంట్రీలోనే ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. రెండు వికెట్లు పడగొట్టి తన పునరాగమాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో టింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.

బారీ మెకార్తీ (33 బంతుల్లో 51 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించాడు. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిధ్‌ కృష్ణ, రవి బిష్ణోయ్‌ తలా 2 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌ ఒక్క వికెట్‌ పడగొట్టాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ వర్షంతో ఆట నిలిచే సమయానికి 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. ఇక ఈ విజయంపై మ్యాచ్‌ అనంతరం భారత కెప్టెన్‌ జస్ప్రీత్‌ బుమ్రా స్పందించాడు.

"ఈ మ్యాచ్‌లో నా ప్రదర్శన పట్ల కూడా చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఏన్సీలో చాలా కష్టపడ్డాను. ప్రాక్టీస్‌ సమయంలో నేను నా రిథమ్‌ను కోల్పోయానని లేదా ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తున్నాని నాకు అనిపించలేదు. ఏన్సీఏ సపోర్ట్‌ స్టాప్‌ వల్లే మళ్లీ అదే క్వాలిటీతో నేను బౌలింగ్‌ చేయగల్గాను. కాబట్టి వారికి ఈ క్రెడిట్‌ ఇవ్వాలనుకుంటున్నాను. మళ్లీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు నాకేం కొత్తగా అన్పించలేదు. కానీ తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది.

పిచ్‌పై కొంత స్వింగ్‌ ఉంది. దాన్ని మేము ఉపయెగించుకోవాలని అనుకున్నాం. అదృష్టవశాత్తూ మేమే టాస్‌ గెలిచాం. అందుకే బౌలింగ్‌ను ఎంచుకున్నాను. మంచు ఎక్కువగా ఉండటం వల్ల కూడా కొంత సహకారం లభించింది. ప్రతీ మ్యాచ్‌ మనకు కొత్త పాఠాలు నేర్పిస్తోంది. ఐర్లాండ్‌ కూడా బాగా ఆడింది. ఈ మ్యాచ్‌లో మేము గెలిచినప్పటికీ.. కొన్ని విషయాల్లో ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. మా బాయ్స్‌ ప్రతీ ఒక్కరూ చాలా కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఈ సిరీస్‌కు వారు బాగా సిద్దమయ్యారు కూడా. ఐపీఎల్‌ కూడా వాళ్లకు బాగా ఉపయోగపడిందని" పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో బుమ్రా పేర్కొన్నాడు.
చదవండి: IND vs IRE: ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఊచకోత.. సిక్సర్ల వర్షం! ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)