Breaking News

పాపం దృవ్‌.. జస్ట్‌ సెంచరీ మిస్‌! అయినా హీరోనే

Published on Sun, 02/25/2024 - 13:42

అరంగేట్ర మ్యాచ్‌లో సత్తాచాటిన టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ దృవ్‌ జురల్‌.. తన రెండో మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో దృవ్‌ జురల్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రోహిత్‌ శర్మ, జడేజా, గిల్‌ వంటి స్టార్‌ బ్యాటర్లు విఫలమైన చోట జురల్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన జురల్‌ ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ.. తన విరోచిత పోరాటాన్ని మాత్రం కొనసాగించాడు. లోయార్డర్‌ బ్యాటర్‌ కుల్దీప్‌ యాదవ్‌తో కలిసి భారత జట్టును ఈ యూపీ ఆటగాడు అదుకున్నాడు. కుల్దీప్‌తో కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని దృవ్‌ నెలకొల్పాడు. అయితే జురల్‌ దురదృష్టవశాత్తూ తృటిలో తన తొలి సెంచరీని చేసే అవకాశాన్ని కోల్పోయాడు.

149 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో దృవ్‌ 90 పరుగులు చేశాడు. సెంచరీకి చేరువలో టామ్‌ హార్ట్‌లీ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యి పెవిలియన్‌కు చేరాడు. సెంచరీ చేయకపోయనప్పటికీ తన అద్బుత ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసును ఈ యువ వికెట్‌ కీపర్‌ గెలుచుకున్నాడు. ఈ క్రమంలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక దృవ్‌ జురల్‌ విరోచిత పోరాటం ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగుల మార్క్‌ను దాటింది.

మొదటి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు భారత్‌ ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌ దిగిన ఇంగ్లండ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 149 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
చదవండి: PSL 2024: పొలార్డ్‌ విధ్వంసం​.. ఆఖరి బంతికి గెలుపు! షాక్‌లో షాహీన్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)