Breaking News

T20 WC 2024: ధోని యూఎస్‌ వస్తాడు: రోహిత్‌ శర్మ

Published on Thu, 04/18/2024 - 13:08

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రస్తుతం ఐపీఎల్‌-2024తో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌కు ఐదుసార్లు టైటిల్‌ అందించిన హిట్‌మ్యాన్‌ ఈసారి మాత్రం కేవలం ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు. ఫ్రాంఛైజీ నిర్ణయం మేరకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో ఆడుతున్నాడు.

ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రోహిత్‌ శర్మ ఆరు మ్యాచ్‌లు ఆడి 261 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ(105*) కూడా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే.. ఆట నుంచి విరామం దొరికిన సమయంలో రోహిత్‌ శర్మ క్లబ్‌ ప్రైరీ ఫైర్ పాడ్‌కాస్ట్‌లో భాగంగా మాజీ క్రికెటర్లు మైకేల్‌ వాన్‌, ఆడం గిల్‌ క్రిస్ట్‌లతో సరదాగా ముచ్చటించాడు.

ధనాధన్‌ ధోని యూఎస్‌ వస్తాడు
ఈ సందర్భంగా ఐపీఎల్‌-2024లో అదరగొడుతున్న టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని గురించి రోహిత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు ఎంఎస్‌ ధోనిని ఒప్పించడం కష్టం.

ఇప్పటికే తను కాస్త అనారోగ్యంతో ఉన్నాడు. బాగా అలసిపోయాడు. అతడు యూఎస్‌కు రావడమైతే ఖాయం. కానీ అక్కడ గోల్ఫ్‌ ఆడతాడు. ఇటీవలి కాలంలో ధోని గోల్ఫ్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు’’ అని రోహిత్‌ పేర్కొన్నాడు. 

డీకేను ఒప్పించడం తేలిక
ఏదేమైనా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఈ సీఎస్‌కే స్టార్‌ నాలుగు బంతుల్లోనే 20 రన్స్‌ రాబట్టిన తీరు అమోఘమని కొనియాడాడు. ఇక మరో వెటరన్‌ ప్లేయర్‌, వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ గురించి ప్రస్తావిస్తూ.. డీకేను వరల్డ్‌కప్‌లో ఆడేలా కన్విన్స్‌ చేయడం చాలా సులువని రోహిత్‌ సరదాగా కామెంట్‌ చేశాడు.

అదే విధంగా.. యంగ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘క్రేజీ. అందరు యువ ఆటగాళ్లు ఇలాగే ఉంటారనుకోండి. అందులో పంత్‌ మరింత క్రేజీ. నేను ఎప్పుడైనా ముభావంగా ఉన్నపుడు నవ్వేలా చేస్తాడు.

పంత్‌ అత్యుత్తమ ప్రదర్శన
అతడు పిల్లాడిగా ఉన్ననాటి నుంచి చూస్తూనే ఉన్నాను. అయితే.. గతేడాది ఆ దుర్ఘటన కారణంగా ఏడాదిన్నర పాటు ఆటకు దూరం కావడం బాధనిపించింది. తను తిరిగిరావడం సంతోషంగా ఉంది. వికెట్‌ కీపర్‌గానూ పంత్‌ అదరగొడుతున్నాడు. గాయాల నుంచి కోలుకుని తన అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు’’ అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. 

వికెట్‌ కీపర్‌గా అతడే?
కాగా జూన్‌ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా టీ20 వరల్డ్‌కప్‌-2024 ఆరంభం కానుంది. జూన్‌ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీలో ఆడబోయే టీమిండియాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వికెట్‌ కీపర్‌గా పంత్‌ పేరు ఖరారైందని రోహిత్‌ శర్మ పరోక్షంగా చెప్పాడంటూ అతడి అభిమానులు మురిసిపోతున్నారు.

చదవండి: #Rishabh Pant: పిచ్చి పట్టిందా? కుల్దీప్‌ ఆగ్రహం.. పంత్‌ రియాక్షన్‌ ఇదే

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)