Breaking News

డెవాల్డ్‌ బ్రెవిస్‌ విధ్వంసం.. సిక్సర్లతో విరుచుకుపడిన సీఎస్‌కే స్టార్‌

Published on Tue, 07/15/2025 - 11:32

జింబాబ్వేలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికా ఘనంగా బోణీ కొట్టింది. నిన్న (జులై 14) హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌లో జరిగిన టోర్నీ ఓపెనర్‌లో సౌతాఫ్రికా ఆతిథ్య జింబాబ్వేపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

జార్జ్‌ లిండే (3-0-10-3), లుంగి ఎంగిడి (4-1-15-1), నండ్రే బర్గర్‌ (4-0-22-1), ఎన్‌ పీటర్‌ (3-0-22-1), కార్బిన్‌ బాష్‌ (4-0-36-0) పొదుపుగా బౌలింగ్‌ చేయడమే కాకుండా వరుస విరామాల్లో వికెట్లు తీసి జింబాబ్వేను తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారు. 

జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సికందర్‌ రజా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే అజేయ అర్ద సెంచరీతో రాణించాడు. రజాతో పాటు బ్రియాన్‌ బెన్నెట్‌ (30), ర్యాన్‌ బర్ల్‌ (29) రెండంకెల స్కోర్లు చేశారు. మదెవెరె 1, క్లైవ్‌ మదండే 8, తషింగ ముసేకివ 9, మున్యోంగ 0, మసకద్జ 1 (నాటౌట్‌) పరుగుకు పరిమితమయ్యారు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. తొలి బంతికే చిచ్చరపిడుగు లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌ డకౌటైనా, రుబిన్‌ హెర్మన్‌ (37 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్స్‌), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (17 బంతుల్లో 41; ఫోర్‌, 5 సిక్సర్లు) సౌతాఫ్రికా విజయానికి పునాది వేశారు. 

కార్బిన్‌ బాష్‌ (23 నాటౌట్‌) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. అతనికి జార్జ్‌ లిండే (3 నాటౌట్‌) సహకరించాడు. సౌతాఫ్రికా 15.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. 5 సిక్సర్లతో విధ్వంసం​ సృష్టించిన బ్రెవిస్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. సౌతాఫ్రికా తరఫున అతనికి ఇదే తొలి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు. 

సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రీజా హెండ్రిక్స్‌ (11), కెప్టెన్‌ డస్సెన్‌ (16) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్‌ నగరవ 3, ట్రెవర్‌ గ్వాండు 2 వికెట్లు తీశారు. 

ఈ టోర్నీలో జింబాబ్వే, సౌతాఫ్రికా సహా న్యూజిలాండ్‌ కూడా పాల్గొంటుంది. తదుపరి మ్యాచ్‌ రేపు సాయంత్రం 4:30 గంటలకు సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ మధ్య హరారే వేదికగా జరుగనుంది.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)