Breaking News

చరిత్ర సృష్టించిన బేబీ ఏబీడీ.. అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు

Published on Sun, 06/29/2025 - 11:48

తొలి ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ (WTC) టైటిల్‌ను గెలుచుకున్న ద‌క్షిణాఫ్రికా క్రికెట్ జ‌ట్టు.. ప్ర‌స్తుతం రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం జింబాబ్వేలో ప‌ర్య‌టిస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు  బులవాయోలోని క్వీన్ స్పోర్ట్స్ క్లబ్ వేదిక‌గా శ‌నివారం(జూన్ 28) నుంచి ప్రారంభ‌మైంది.

తొలి రోజు ఆట‌లో స‌ఫారీ బ్యాట‌ర్లు స‌త్తాచాటారు. మొద‌టి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ద‌క్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల న‌ష్టానికి 418 ప‌రుగులు చేసింది. స‌ఫారీ బ్యాట‌ర్ల‌లో అరంగేట్ర ఆటగాళ్లు లువాన్‌-డ్రి ప్రిటోరియస్‌(153), బాష్‌(100 బ్యాటింగ్‌) సెంచ‌రీలతో చెల‌రేగ‌గా.. డెవాల్డ్ బ్రెవిస్( 41 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 51) హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు.

అరంగేట్రంలోనే బ్రెవిస్ ఓ వ‌ర‌ల్డ్ రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. డెబ్యూ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా బ్రెవిస్ చ‌రిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బేబీ ఏబీడీ కేవలం 38 బంతుల్లోనే ఆర్ధ శతకం సాధించాడు. 

బ్రెవిస్ కంటే ముందు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ టిమ్ సౌథీ తన డెబ్యూ టెస్టులో 29 బంతులు, ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతల్ 37 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కానీ ఈ రెండు హాఫ్ సెంచరీలు కూడా రెండో ఇన్నింగ్స్‌లో వచ్చినవే కావడం గమనార్హం.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్‌! వీడియో వైరల్‌
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)