Breaking News

'టీమిండియా'పై కేసు.. గట్టిగా అక్షింతలు వేసిన ఢిల్లీ హైకోర్టు

Published on Fri, 10/10/2025 - 11:18

భారత క్రికెట్‌ జట్టును టీమిండియా (Team India) అని పిలవడంపై అభ్యంతరం వ్యక్తమైంది. ఓ ప్రైవేట్‌ సంస్థ (BCCI) ఎంపిక చేసే జట్టును భారత జట్టు లేదా టీమిండియా అని పిలవకూడదని రీపక్ కన్సాల్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత  పిటిషన్‌ (PIL) దాఖలు చేశారు.

బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుకు ఇండియా లేదా భారత్‌ పేరును వాడుకోకూడదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలా చేసి జాతీయ గుర్తింపు పొందడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.

సమాచార హక్కు చట్టం (RTI) ఆధారంగా బీసీసీఐకి ప్రభుత్వ గుర్తింపు లేదా నిధులు లేవని పేర్కొన్నారు. జాతీయ చిహ్నాలు, జెండా, పేరు వాడకం ద్వారా 1950 చట్టం, 2002 ఫ్లాగ్‌ కోడ్‌ ఉల్లంఘన జరుగుతోందని అభిప్రాయపడ్డారు. ప్రసార్‌ భారతి వంటి జాతీయ ప్రసార సంస్థలు బీసీసీఐ జట్టును ‘టీమిండియా’ పేరుతో ప్రసారం చేయడం సరికాదని పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తిప్పికొట్టింది. ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, న్యాయమూర్తి తుషార్ రావ్ గెడెలా ఈ పిటిషన్‌ను కోర్టు సమయాన్ని వృథా చేసే చర్యగా అభివర్ణించారు.

ఈ జట్టు విశ్వ వేదికపై భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తుంది. అలాంటప్పుడు టీమిండియా లేదా భారత జట్టని ఎందుకు పిలవకూడదని న్యాయమూర్తి తుషార్ గెడెలా పిటిషనర్‌ను ‍ప్రశ్నించారు.

క్రీడా జట్లను ప్రభుత్వ అధికారులు ఎంపిక చేస్తారా..? కామన్‌వెల్త్‌, ఒలింపిక్స్‌లో పాల్గొనే జట్లను ప్రభుత్వమే ఎంపిక చేస్తుందా అని ప్రధాన న్యాయమూర్తి ఉపాధ్యాయ ప్రశ్నించారు. మీ ఇంట్లో జాతీయ జెండా ఎగురవేయడం నిషేధమా అని  నిలదీశారు. 

దేశ పేరు, జాతీయ చిహ్నాల వాడకం ప్రభుత్వానికి మాత్రమే పరిమితం కాదని స్పష్టం చేశారు. క్రీడా వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం ప్రమాదకరమని హెచ్చరించారు. దేశానికి సంబంధించి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అలాంటి వాటిపై దృష్టి పెట్టాలని అక్షింతలు వేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు అర్హం కాదని కొట్టి పారేశారు.

ఈ తీర్పుతో టీమిండియా అనే పేరు చట్టబద్ధంగా కొనసాగించవచ్చని, బీసీసీఐ జట్టు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

చదవండి: టీమిండియాపై అనూహ్య విజయం.. దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)