Breaking News

అర్జెంటీనా 'అదరహో'...

Published on Sun, 07/05/2026 - 04:10

మయమీ: మూడు సార్లు ప్రపంచ కప్‌ విజేత, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఒక వైపు...తొలిసారి వరల్డ్‌ కప్‌లో ఆడుతున్న పసికూన మరో వైపు...ఫలితం ఎలా ఉంటుందో అందరూ అంచనా వేసుకోవచ్చు. కానీ ఆ దిగ్గజం ముందు ఈ కొత్త టీమ్‌ అంత సులువుగా తలొగ్గలేదు. ఓడినా అసాధారణ ఆటతో చివరి వరకు పోరాడింది. కాస్త అదృష్టం కలిసిరాక చివరకు నిరాశతో నిష్క్రమించాల్సి వచ్చింది. దిగ్గజం లయోనల్‌ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా గెలుపు కోసం 120 నిమిషాల పాటు ప్రతీ సెకన్‌ చెమటోడ్చాల్సి వచ్చింది. ఎన్నో గోల్‌ ప్రయత్నాలు విఫలం కాగా, చివరకు చచ్చీచెడి పైచేయి సాధించింది. 

అర్జెంటీనా, కొత్త జట్టు కేప్‌ వెర్డే మధ్య జరిగిన ‘ఫిఫా’ వరల్డ్‌ కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ గురించి సంక్షిప్త వివరణ ఇది. శనివారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3–2 గోల్స్‌ తేడాతో కేప్‌ వెర్డేను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. అర్జెంటీనా తరఫున లయోనల్‌ మెస్సీ (29వ నిమిషం), లిజాండ్రో మార్టినెజ్‌ (92వ ని.) గోల్స్‌ కొట్టగా... కేప్‌ వెర్డె ఆటగాళ్లలో డెరాయ్‌ డ్యుయార్టె (59వ ని.), సిడ్నీ లోపెజ్‌ కాబ్రాల్‌ (103వ ని.) చెరో గోల్‌ కొట్టారు.

అయితే 111వ నిమిషంలో కేప్‌ వెర్డె ఆటగాడు డైనీ బోర్జెస్‌ చేసిన సెల్ఫ్‌ గోల్‌తో అర్జెంటీనా గట్టెక్కగా, కేప్‌ వెర్డె దురదృష్టవశాత్తూ పరాజయం పాలైంది. చాలా సమయం పాటు గోల్‌ కీపర్‌ వోజిన్హాను దాటడం అర్జెంటీనా వల్ల కాలేదు. మొత్తంగా మ్యాచ్‌లో అతను 10 గోల్స్‌ను నిలువరించగా... వాటిలో ఐదు మెస్సీ కొట్టినవే కావడం విశేషం. సుమారు ఐదు లక్షల జనాభా ఉన్న కేప్‌ వెర్డె తొలి సారి వరల్డ్‌ కప్‌కు అర్హత సాధించడంతో పాటు నాకౌట్‌కు చేరి సగర్వంగా టోర్నీని ముగించింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఈజిప్‌్టతో అర్జెంటీనా తలపడుతుంది.  

ఆద్యంతం అద్భుతంగా... 
అర్జెంటీనా స్థాయిని బట్టి చూస్తే ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్‌ కేప్‌ వెర్డె అద్భుత ప్రదర్శనతో హోరాహోరీగా జరిగింది. అర్జెంటీనా దూకుడు కనబర్చిన ప్రతీసారి కేప్‌ వెర్డె అంతే దీటుగా ఎదురుదాడి చేసింది. లీగ్‌ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లనూ డ్రాగా ముగించి ఓటమి లేకుండా ముందంజ వేసిన వెర్డె నాకౌట్‌ పోరులోనూ సత్తా చాటింది.  ఎట్టకేలకు 29వ నిమిషంలో అర్జెంటీనా బోణీ చేసింది. లిజాండ్రో మార్టినెజ్‌ ఇచ్చిన లాఫ్టెడ్‌ పాస్‌ను అందుకున్న మెస్సీ పూర్తి నియంత్రణతో దూసుకుపోయి తొలి గోల్‌ సాధించాడు. 

ఈ ప్రపంచకప్‌లో మెస్సీకిది 7వ గోల్‌ కావడం విశేషం. అయితే రెండో అర్ధభాగం మొదలు కాగానే కేప్‌ వెర్డె దూకుడు పెంచింది. దాని ఫలితం తొమ్మిది నిమిషాల్లోనే వచ్చింది. డ్యుయార్టెను నిలువరించడం అర్జెంటీనా కీపర్‌ మార్టినెజ్‌ వల్ల కాలేదు. 73వ నిమిషంలో ఫ్రీ కిక్‌ లభించగా మెస్సీ కొట్టిన షాట్‌ను వెర్డె కీపర్‌ వోజిన్హా అద్భుతంగా అడ్డుకున్నాడు. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవడంతో మ్యాచ్‌ అదనపు సమయంలోకి వెళ్లింది. ఆట ఆరంభమైన రెండు నిమిషాలకే డిఫెండర్లంతా ఒక వైపు ఉండిపోగా, లిజాండ్రో చాకచక్యంగా బంతిని అందుకొని సునాయాసంగా పోస్ట్‌లోకి కొట్టాడు. అయితే ఆ తర్వాత కేప్‌ వెర్డె తగిన జవాబిచ్చింది. 

‘గోల్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ అనదగ్గ రీతిలో కాబ్రాల్‌ స్కోరు చేయడం విశేషం. పెనాల్టీ బాక్స్‌ చివర్లో కుడి వైపు కార్నర్‌కు అతను కొట్టిన గోల్‌తో అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆట చివరకు వస్తుండగా అర్జెంటీనా పోరాడుతున్నా... కేప్‌ వెర్డె పట్టు వదల్లేదు. అయితే ఆ జట్టును అనూహ్యంగా దురదృష్టం వెంటాడింది. మెస్సీ కిక్‌ను క్రిస్టియాన్‌ రొమెరో హెడర్‌తో నియంత్రించే ప్రయత్నం చేయగా... వెర్డె ఆటగాడు బోర్జెస్‌ చేతికి తగిలిన బంతి పోస్ట్‌లోకి పడింది. ఆ తర్వాత జట్టు ఎంత ప్రయత్నించినా స్కోరును సమం చేయలేకపోయింది.

క్వార్టర్‌ ఫైనల్లో మొరాకో 
హూస్టన్‌: ఆఫ్రికా జట్టు మొరాకో వరల్డ్‌ కప్‌లో వరుసగా రెండో సారి క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. 2022 టోర్నీలో నాలుగో స్థానంలో నిలిచిన టీమ్‌ ఈ సారి కూడా స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చింది. శనివారం జరిగిన ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో మొరాకో 3–0 గోల్స్‌ తేడాతో సహ ఆతిథ్య జట్టు కెనడాపై విజయం సాధించింది. మొరాకో తరఫున అజ్‌దిన్‌ ఒనాహీ (50వ నిమిషం, 82వ నిమిషం) రెండు గోల్స్‌ కొట్టగా... సూఫియాన్‌ రహీమి (90+8వ నిమిషం) ఒక గోల్‌ సాధించాడు. కెనడా తొమ్మిది సార్లు గోల్‌ అవకాశాలు సృష్టించుకున్నా... మొరాకో గోల్‌ కీపర్‌ యాసీన్‌ బోనో వాటిని సమర్థంగా అడ్డుకున్నాడు.  

ప్రిక్వార్టర్స్‌లో కొలంబియా 
లీగ్‌ దశలో అజేయంగా నిలిచి గ్రూప్‌లో అగ్రస్థానంతో ముందంజ వేసిన కొలంబియా నాకౌట్‌ మ్యాచ్‌లోనూ అదే జోరున కొనసాగించింది. శనివారం మ్యాచ్‌లో కొలంబియా 1–0 గోల్‌ తేడాతో ఘనా జట్టును ఓడించింది. కొలంబియా తరఫున జాన్‌ అరియాస్‌ (14వ నిమిషం) ఏకైక గోల్‌ సాధించాడు. ఆ తర్వాత ఇరు జట్లు పలు ప్రయత్నాలు చేసినా మరో గోల్‌ నమోదు కాలేదు. ఘనా గోల్‌ కీపర్‌ లారెన్స్‌ జిగి ప్రత్యర్థి ఎనిమిది గోల్‌ ప్రయత్నాలను సమర్థంగా నిలువరించడం విశేషం. 56వ నిమిషంలో కొలంబియా ఆటగాడు లూయీస్‌ డియాజ్‌ బంతిని గోల్‌పోస్ట్‌లోకి కొట్టినా రిఫరీ దానిని ‘ఆఫ్‌సైడ్‌’గా తీర్మానించి గోల్‌ ఇవ్వలేదు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో స్విట్జర్లాండ్‌ను కొలంబియా ఎదుర్కొంటుంది.  

‘షూటౌట్‌’లో ఈజిప్ట్‌ ముందంజ...
ఖతర్‌లో జరిగిన గత ప్రపంచ కప్‌కు అర్హత సాధించలేకపోయిన ఈజిప్ట్‌ ఈ సారి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. నాకౌట్‌ మ్యాచ్‌లో ఈజిప్ట్‌ పెనాల్టీ షూటౌట్‌లో 4–2 గోల్స్‌ తేడాతో ఆ్రస్టేలియాపై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఈజిప్ట్‌ తరఫున ఇమామ్‌ అషూర్‌ (13వ నిమిషం) గోల్‌ సాధించాడు. ఆ తర్వాత ఈజిప్ట్‌ ఆటగాడు మొహమ్మద్‌ హనీ (55వ ని.) అనూహ్యంగా ‘సెల్ఫ్‌ గోల్‌’ చేయడంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణీత సమయం తర్వాత అదనపు సమయంలో కూడా పరస్థితి మారలేదు. దాంతో పెనాల్టీ షూటౌట్‌ తప్పలేదు. ఈజిప్ట్‌ తరఫున మహమూద్‌ సాబెర్, రామీ రాబియా, మొహమ్మద్‌ సలా, హొసామ్‌ అబ్దెల్‌ గోల్‌ చేయగా... ఆ్రస్టేలియా ఆటగాళ్లలో జాక్సన్‌ ఇర్విన్, అవేర్‌ మాబిల్‌ మాత్రమే సఫలమయ్యారు. ప్రపంచ కప్‌లో మూడు సార్లు నాకౌట్‌ మ్యాచ్‌ ఆడిన ఆ్రస్టేలియా ప్రతీ సారి ఓటమిపాలైంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)