Breaking News

World Cup 2025: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్‌

Published on Wed, 10/01/2025 - 11:40

భారత మహిళా క్రికెటర్‌ దీప్తి శర్మ (Deepthi Sharma) చరిత్ర సృష్టించింది. వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో అర్ద సెంచరీతో పాటు మూడు వికెట్లు తీసిన తొలి భారత ప్లేయర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025లో (ICC Women's World Cup 2025) భాగంగా నిన్న (సెప్టెంబర్‌ 30) శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో (India vs Sri Lanka) దీప్తి ఈ ఘనత సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌లో జట్టుకు చాలా ముఖ్యమైన అర్ద సెంచరీ (53) సాధించి, అనంతరం బౌలింగ్‌లోనూ సత్తా చాటి 3 వికెట్లు (10-1-54-3) తీసింది. దీప్తితో పాటు అమన్‌జోత్‌ కౌర్‌ (57, 6-0-37-1), స్నేహ్‌ రాణా (28 నాటౌట్‌, 10-0-32-2) కూడా రాణించడంతో ఈ మ్యాచ్‌లో భారత్‌ శ్రీలంకపై ఘన విజయం సాధించింది.

124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో దీప్తి వ్యక్తిగతంగా రాణించడమే కాకుండా టెయిలెండర్లతో అమూల్యమైన భాగస్వామ్యాలు నెలకొల్పింది. అమన్‌జోత్‌తో కలిసి ఏడో వికెట్‌కు 103 పరుగులు, స్నేహ్‌ రాణాతో ఎనిమిదో వికెట్‌కు 42 పరుగులు జోడించి భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించింది.

అనంతరం బౌలింగ్‌లో అతి కీలకమైన చమారీ ఆటపట్టు (43) వికెట్‌తో పాటు కవిష దిల్హరి (15), వికెట్‌కీపర్‌ అనుష్క సంజీవని (6) వికెట్లు తీసి శ్రీలంకను చావుదెబ్బ కొట్టింది. శ్రీలంకపై గెలుపుతో టీమిండియా 2025 ప్రపంచ కప్‌ను ఘనంగా ప్రారంభించింది. ఈ టోర్నీలో భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ అక్టోబర్‌ 5న కొలొంబో వేదికగా జరుగనుంది.

స్కోర్‌ వివరాలు..
భారత్‌- 269/8- వర్షం కారణంగా మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు
శ్రీలంక- 211 ఆలౌట్‌- డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన 59 పరుగుల తేడాతో భారత్‌ విజయం

రెండో స్థానానికి ఎగబాకిన దీప్తి
ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన అనంతరం దీప్తి శర్మ మరో ఘనత కూడా సాధించింది. వన్డేల్లో రెండో అత్యధిక వికెట్లు సాధించిన భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఈ క్రమంలో నీతూ డేవిడ్‌ను వెనక్కు నెట్టింది. ఈ జాబితాలో జులన్‌ గోస్వామి టాప్‌లో ఉంది.

భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు..
255 - జులన్ గోస్వామి
143 - దీప్తి శర్మ
141 - నీతూ డేవిడ్
100 - నూషిన్ అల్ ఖదీర్
99 - రాజేశ్వరి గైక్వాడ్

చదవండి: IND VS AUS: విధ్వంసకర శతకం.. చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)