Breaking News

చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. 'హనుమంతుడి దయ వల్లే ఇదంతా'

Published on Mon, 06/15/2026 - 10:18

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే విజయంలో దీప్తి శర్మ కీలకపాత్ర పోషించింది. బ్యాటింగ్‌లో విలువైన పరుగులు, బౌలింగ్‌లో ఐదు వికెట్లు సహా ఫీల్డింగ్‌లో ఒక రనౌట్ చేసి  ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేసింది. 

తద్వారా చిరకాల ప్రత్యర్థిపై విజయంలో దీప్తి శర్మ కర్త, కర్మ, క్రియగా నిలిచింది. ఈ నేపథ్యంలో దీప్తి శర్మ ఒక అరుదైన రికార్డు సాధించింది. మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దీప్తి శర్మ అగ్రస్థానంలో నిలిచింది. పాక్‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడం ద్వారా 166 వికెట్లతో తొలి స్థానంలో కొనసాగుతుంది. 

థాయ్‌లాండ్‌కు చెందిన తిపాట్చా పుత్తావాంగ్ (165 వికెట్లు) రెండో స్థానంలో ఉండగా, వాండాకు చెందిన హెన్రిట్టే ఇష్విమే (160 వికెట్లతో) మూడో స్థానంలో, ఆస్ట్రేలియాకు చెందిన మేగన్ షట్ (152 వికెట్లు), థాయ్‌లాండ్‌కు చెందిన ఒన్నిచా కమ్‌చోఫూ (148 వికెట్లు) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. 

ఇక అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి దీప్తి శర్మ ఇప్పటివరకు 354 వికెట్లు పడగొట్టింది. తద్వారా అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది. తొలి స్థానంలో భారత్‌కు చెందిన మాజీ బౌలర్ జులన్ గోస్వామి (355 వికెట్లు) ఉండగా, ఇంగ్లండ్‌కు చెందిన కేథరిన్ బ్రంట్ (335 వికెట్లు), ఆస్ట్రేలియాకు చెందిన ఎలీస్ పెర్రీ (332 వికెట్లు),  ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎసల్‌స్టోన్ (327 వికెట్లు) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.

భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల్లోనూ దీప్తి శర్మ అరుదైన రికార్డు సాధించింది.
5/10 – దీప్తి శర్మ vs పాకిస్తాన్, బర్మింగ్‌హామ్, 2026, 
5/11 – జులన్ గోస్వామి vs ఆస్ట్రేలియా, విశాఖపట్నం, 2012
5/15 – రేణుకా సింగ్ vs ఇంగ్లాండ్, గ్కెబెర్హా, 2023
5/16 – ప్రియాంక రాయ్ vs పాకిస్థాన్, టౌంటన్, 2009
5/19 – దీప్తి శర్మ vs దక్షిణాఫ్రికా, జోహన్నెస్‌బర్గ్, 2026

28 ఏళ్ల ఆమె మహిళల టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారతదేశం తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేయగా, టోర్నమెంట్ చరిత్రలో ఏ బౌలర్ అయినా సాధించిన గణాంకాలలో ఇది మూడవ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.

మహిళల టీ20 ప్రపంచ కప్‌లలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు:
5/5 – డియాండ్రా డాటిన్ (వెస్ట్ ఇండీస్) వర్సెస్‌ బంగ్లాదేశ్, ప్రొవిడెన్స్, 2018
5/8 – సునే లూస్ (దక్షిణాఫ్రికా) వర్సెస్‌ ఐర్లాండ్, చెన్నై, 2016
5/10 – దీప్తి శర్మ (భారతదేశం) వర్సెస్‌ పాకిస్తాన్, బర్మింగ్‌హామ్, 2026, ఈరోజు*
5/12 – ఆష్లీ గార్డనర్ (ఆస్ట్రేలియా) వర్సెస్‌ న్యూజిలాండ్, పార్ల్, 2023
5/15 – రేణుకా సింగ్ (భారత్) వర్సెస్ ఇంగ్లండ్, గ్వేబెర్హా, 2023

ఇక మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత దీప్తి మాట్లాడుతూ ఈ ఘనత మొత్తం జట్టుకే చెందుతుందని చెప్పింది. తన విజయానికి హనుమాన్ జీ ఆశీస్సులు కూడా కారణమని పేర్కొంది. ఐసీసీ టోర్నమెంట్లు తనకు ప్రత్యేకమైనవని, అలాంటి వేదికలపై ఆడటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని తెలిపింది. స్పిన్నర్లకు అనుకూలమైన పిచ్లపై బౌలింగ్ చేయడం తనకు ఎంతో ఇష్టమని, ప్రతి బంతికి వేగం మారుస్తూ సరైన ప్రాంతాల్లో బంతులు వేయడమే తన విజయ రహస్యమని వివరించింది.

Videos

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)