Breaking News

టీమిండియావైపు దూసుకొస్తున్న సరికొత్త పేస్‌ సంచలనం

Published on Wed, 12/24/2025 - 16:39

టీమిండియావైపు మరో పేస్‌ గన్‌ దూసుకొస్తున్నాడు. అతడి పేరు దీపేశ్‌ దేవేంద్రన్‌. తమిళనాడుకు చెందిన ఈ కుర్రాడి వయసు 17 ఏళ్లు. కుడి చేతి వాటం మీడియం ఫాస్ట్‌ బౌలింగ్‌ చేసే దీపేశ్‌.. తాజాగా ముగిసిన అండర్‌-19 ఆసియా కప్‌ ద్వారా వెలుగులోకి వచ్చాడు.

ఈ టోర్నీలో దీపేశ్‌ అంచనాలను మించి రాణించాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లో వికెట్లు తీసి యంగ్‌ ఇండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో మొత్తం 5 మ్యాచ్‌లు ఆడి 4.77 ఎకానమీతో 14 వికెట్లు తీశాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో దీపేశ్‌ ఈ ప్రదర్శన నమోదు చేశాడు.

సౌతాఫ్రికా పేస్‌ దిగ్గజం డేల్‌ స్టెయిన్‌ను ఆదర్శనంగా తీసుకొనే దీపేశ్‌.. అతనిలాగే పేస్‌ను ఆయుధంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దీపేశ్‌కు వేగంతో పాటు లైన్‌ అండ్‌ లెంగ్త్‌ మెయింటైన్‌ చేసే కంటిస్టెన్సీ ఉంది. 

అలాగే కీలక సమయాల్లో బ్యాటర్లను ఒత్తిడిలోని నెట్టి, వికెట్లు తీసే సత్తా కూడా ఉంది. ఆదిలోనే వికెట్లు తీసే సామర్థ్యం దీపేశ్‌ సొంతం. పైన ప్రస్తావించిన విషయాలన్నీ తాజాగా జరిగిన ఆసియా కప్‌లో దీపేశ్‌ చేసి చూపించాడు.

దీపేశ్‌.. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో మధురై పాంథర్స్‌ తరఫున సత్తా చాటడం ద్వారా తొలిసారి వెలుగులోకి వచ్చాడు. ఆ ప్రదర్శనల కారణంగానే దీపేశ్‌కు ఆసియా కప్‌ అండర్‌-19 జట్టులో చోటు దక్కింది.

వేగం, కచ్చితత్వం, దూకుడుతో పాటు లైన్ ఆండ్‌ లెంగ్త్‌ కంట్రోల్‌తో టాపార్డర్‌ను కూలదోసే సామర్థ్యం దీపేశ్‌ను మిగతా వారితో పోలిస్తే ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. సాధారణంగా వీటన్నిటి కలయిక ఒకే బౌలర్‌లో ఉండటం చాలా అరుదు. ఈ అసాధారణ ప్రతిభే దీపేశ్‌ను భావి భారత ఫాస్ట్‌ బౌలర్‌గా చిత్రీకరిస్తుంది.

ప్రస్తుతం గంటకు 140 కిమీ వేగానికి దగ్గరగా బౌలింగ్‌ చేస్తున్న దీపేశ్‌.. సరైన శిక్షణ​ ఇస్తే మరింత పేస్‌ను రాబట్టగలడని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీపేశ్‌లో పేస్‌ వేరియేషన్‌ కూడా ఉంది. స్ట్రైక్‌ బౌలర్‌గానే కాకుండా ఫస్ట్‌ ఛేంజ్‌ బౌలర్‌గా కూడా ఉపయోగపడగలడు. 

17 ఏళ్ల వయసులోనే ఖండాంతర టోర్నీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచిన దీపేశ్‌ ఫిట్‌నెస్‌ మేనేజ్‌మెంట్‌పై కూడా దృష్టి పెట్టగలిగితే త్వరలోనే టీమిండియా తలుపులు తట్టే అవకాశం ఉంది. ఆసియా కప్‌లో ఫైనల్‌ మినహా దీపేశ్‌ ప్రతి మ్యాచ్‌లో చాలా పొదుపుగా కూడా బౌలింగ్‌ చేశాడు. దీపేశ్‌బ్యాటింగ్‌లోనూ అడపాదడపా మెరుపులు మెరిపించగలడు. 

పాక్‌తో జరిగిన ఫైనల్లో ఇది కూడా నిరూపితమైంది. ఆ మ్యాచ్‌ లో భారత ఓటమి ఖరారైనా దీపేశ్‌ బ్యాట్‌ ఝలిపించాడు. ఈ ఆల్‌రౌండ్‌ లక్షణం దీపేశ్‌ను టీమిండియా అవకాశానికి మరింత చేరువ చేస్తుంది. 

తాజాగా ముగిసిన అండర్‌-19 ఆసియా కప్‌లో దీపేశ్‌ ప్రదర్శనలు.. 
పాకిస్తాన్‌పై 3/16
మలేషియాపై 5/22
శ్రీలంకపై 1/25
యూఏఈపై 2/21
పాకిస్తాన్‌పై 3/83

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)