Breaking News

పని చేయని ధోని మంత్రం.. పూర్తిగా విఫలమయ్యాడు

Published on Wed, 05/03/2023 - 18:58

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో సీఎస్‌కే స్టార్‌ బౌలర్‌ దీపక్‌ చహర్‌ పెద్దగా మెరవడం లేదు. గాయం కారణంగా సీజన్‌లో చహర్‌ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. మూడు మ్యాచ్‌లు కలిపి 97 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయాడు. తాజాగా లక్నో సూపర​జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్‌ చహర్‌ ఘోరంగా ఫెయిలయ్యాడు.

నాలుగు ఓవర్లు వేసి 10.25 ఎకానమీ రేటుతో 41 పరుగులు సమర్పించుకున్నాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చిన దీపక్‌ చహర్‌ తన కెప్టెన్‌ ధోని నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడు. టాస్‌ సమయంలో చహర్‌ గురించి ధోని ప్రస్తావించాడు. ''చహర్‌ గాయం నుంచి కోలుకోవడంతో ఆకాశ్‌ సింగ్‌ను తప్పించాం.. స్లోపిచ్‌పై చహర్‌ మెరిసే అవకాశం ఉంది. అందుకే అతను తుది జట్టులోకి తీసుకున్నాం'' అని ధోని పేర్కొన్నాడు. కానీ ధోని మంత్రం పనిచేయకపోగా.. చహర్‌ విఫలమయ్యాడు.

2019లో సీఎస్‌కే తరపున 22 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించిన దీపక్‌ చహర్‌ ఆ తర్వాత 2020లో 14 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీశాడు. ఇక 2021 సీస్‌కే ఛాంపియన్‌గా నిలవడంలో దీపక్‌ చహర్‌ కీలకపాత్ర పోషించాడు. 15 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసిన చహర్‌ను ఆ తర్వాత జరిగిన మెగా వేలంలో సీఎస్‌కే రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ దీపక్‌ చహర్‌ గాయం కారణంగా 2022 ఐపీఎల్‌ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ సీజన్‌లోనూ గాయంతో పెద్దగా ఆడింది లేదు.

చదవండి: 'నా చివరి ఐపీఎల్‌ అని మీరే డిసైడ్‌ అయ్యారా?'

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)