Breaking News

డేవిడ్‌ మలాన్‌ విధ్వంసం.. 25 బంతుల్లోనే..!

Published on Tue, 09/24/2024 - 12:47

జి​​మ్‌ ఆఫ్రో టీ10 లీగ్‌లో కేప్‌ టౌన్‌ సాంప్‌ ఆర్మీ (ఇంగ్లండ్‌) ఆటగాడు డేవిడ్‌ మలాన్‌ విధ్వంసం సృష్టించాడు. నైస్‌ లాగోస్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేశాడు. మలాన్‌తో పాటు రోహన్‌ ముస్తఫా కూడా మెరుపు అర్ద సెంచరీతో (23 బంతుల్లో 50; 10 ఫోర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన సాంప్‌ ఆర్మీ.. నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 151 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. సాంప్‌ ఆర్మీ ఇన్నింగ్స్‌లో బ్రియాన్‌ బెన్నెట్‌ 0, మరుమణి 7, లియోనార్డో జూలియన్‌ 10, ఖయాస్‌ అహ్మద్‌ 8 పరుగులు చేశారు. లాగోస్‌ బౌలర్లలో బినుర ఫెర్నాండో, ముజరబానీ, తిసార పెరీరా తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లాగోస్‌ 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా సాంప్‌ ఆర్మీ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. లాగోస్‌ ఇన్నింగ్స్‌లో తిసార పెరీరా (17 బంతుల్లో 48; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. రస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌ 19, అవిష్క ఫెర్నాండో 19, నజీబుల్లా జద్రాన్‌ 11, ర్యాన్‌ బర్ల్‌ 17*, జాషువ బిషప్‌ 6 పరుగులు చేశారు.  సాంప్‌ ఆర్మీ బౌలర్లలో అమీర్‌ హంజా 2, డేవిడ్‌ విల్లే, రోహన్‌ ముస్తఫా, ఖయాస్‌ అహ్మద్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

నిన్ననే (సెప్టెంబర్‌ 23) జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో జోబర్గ్‌ బంగ్లా టైగర్స్‌పై హరారే బోల్ట్స్‌.. డర్బన్‌ వోల్వ్స్‌పై బులవాయో జాగ్వర్స్‌ విజయాలు సాధించాయి. 

జోబర్గ్‌ బంగ్లా టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హరారే బోల్ట్స్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టైగర్స్‌ 9.4 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌటైంది. 20 పరుగులు చేసిన సికందర్‌ రజా టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బోల్ట్స్‌ 9.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. దసున్‌ షనక (21 బంతుల్లో 50 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో బోల్ట్స్‌ను గెలిపించాడు.

డర్బన్‌ వోల్వ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బులవాయో జాగ్వర్స్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వోల్వ్స్‌.. విల్‌ స్మీడ్‌ (55 నాటౌట్‌), మార్క్‌ చాప్‌మన్‌ (38 నాటౌట్‌) రాణించడంతో 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. అనంతరం లారీ ఈవాన్స్‌ (26), నిక్‌ హబ్సన్‌ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో జాగ్వర్స్‌ మరో మూడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 

చదవండి: చరిత్ర సృష్టించిన పూరన్‌
 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)