Breaking News

'వెల్' డ‌న్ స‌ర్ఫ‌రాజ్‌.. ఎంతో క‌ష్ట‌ప‌డ్డావు: డేవిడ్‌ వార్నర్‌

Published on Sat, 10/19/2024 - 12:46

బెంగ‌ళూరు వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మొద‌టి టెస్టులో టీమిండియా యువ ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ సెంచ‌రీతో మెరిశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో త‌న సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. స‌ర్ఫ‌రాజ్‌కు ఇది ఇది అంతర్జాతీయ క్రికెట్ లో అతనికి తొలి సెంచరీ కావడం విశేషం. భార‌త క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న స‌మ‌యంలో అద్బుత‌మైన ఆట తీరును క‌న‌బ‌రిచి శ‌త‌కాన్ని న‌మోదు చేశాడు. కేవలం 110 బంతుల్లోనే 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో త‌న సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో డ‌కౌటై నిరాశ‌ప‌రిచిన స‌ర్ఫ‌రాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అందుకు భిన్నంగా ఆడుతున్నాడు. కివీస్ బౌల‌ర్ల‌కు చుక్కలు చూపిస్తున్నాడు. త‌న‌దైన షాట్ల‌తో అభిమానుల‌ను ఈ ముంబైక‌ర్ అల‌రిస్తున్నాడు. ప్రస్తుతం 125 ప‌రుగుల‌తో స‌ర్ఫ‌రాజ్ ఆజేయంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో  మెరుపు ఇన్నింగ్స్ ఆడిన స‌ర్ఫ‌రాజ్‌పై స‌ర్వాత్ర‌ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. 

తాజ‌గా ఈ జాబితాలోకి ఆస్ట్రేలియా దిగ్గ‌జం డేవిడ్ వార్న‌ర్ చేరాడు. అద్బుత‌మైన ఇన్నింగ్స్ ఆడావు అంటూ డేవిడ్ భాయ్ కొనియాడాడు. "వెల్ డ‌న్ స‌ర్ఫ‌రాజ్‌. చాలా క‌ష్ట‌ప‌డ్డావు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావు, చూడ‌టానికి రెండు క‌ళ్లు స‌రిపోవ‌డం లేదంటూ" వార్న‌ర్ త‌న ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. కాగా ఐపీఎల్‌లో సర్ఫరాజ్‌, వార్నర్‌ కలిసి ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించారు.

ఇక ఈ మ్యాచ్‌లో 71 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఇండియా జ‌ట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో  3 వికెట్ల నష్టానికి 344 ప‌రుగులు చేసింది. న్యూజిలాండ్ కంటే భారత్ 13 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ 125, రిషబ్ పంత్ 53 పరుగులతో క్రీజులో ఉన్నారు. అయితే వ‌ర్షం కార‌ణంగా ఆట ప్ర‌స్తుతం నిలిచిపోయింది.
 చదవండి: IND vs NZ: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి!

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)