Breaking News

విండీస్‌లో భారత్‌కు వింత పరిస్థితి.. లగేజీ మొదలు వీసా సమస్య వరకు

Published on Wed, 08/03/2022 - 12:36

వెస్టిండీస్‌ పర్యటనలో టీమిండియాకు వింత పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముందు లగేజీ సమస్య రాగా.. తాజాగా ఆటగాళ్లకు వీసా సమస్య వచ్చి వచ్చింది. విషయంలోకి వెళితే.. విండీస్‌తో చివరి రెండు టి20లు అమెరికాలోని ఫ్లోరిడాలోని మియామిలో జరగనున్నాయి. కాగా మొదట అమెరికా వెళ్లేందుకు ఇరుజట్లలోని ఆటగాళ్లకు వీసాలు రాకపోవడంతో మ్యాచ్‌ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

దీంతో స్వయంగా రంగంలోకి దిగిన విండీస్‌ క్రికెట్‌ బోర్డు వీసా ఎంట్రీకి సంబంధించిన కార్యచరణను పూర్తి చేయాల్సి వచ్చింది. ముందుగా బుధవారం ఇరుజట్ల ఆటగాళ్లు గయానాలోని జార్జిటౌన్‌కు చేరుకోనున్నారు. గయానాలోని అమెరికా ఎంబసీలో ఆటగాళ్లకు వీసా అపాయింట్‌మెంట్స్‌ బుక్‌ చేశారు. అన్ని సక్రమంగా జరిగితే గురువారం సాయంత్రం వరకు ఆటగాళ్లు ప్లోరిడాలోని మయామికి చేరుకుంటారు.

క్రికెట్‌ వెస్టిండీస్‌ బోర్డు(సీడబ్ల్యూఐ) అధ్యక్షుడు రికీ స్కెరిట్‌  మాట్లాడుతూ.. ''ఆటగాళ్లకు వీసా సమస్య తీరిపోయినట్లేనని భావిస్తున్నాం. గయానా నుంచి ఆటగాళ్లకు వీసా అపాయింట్‌మెంట్‌ ఇప్పించాం. ముందుగా గయానాకు వెళ్లనున్న ఆటగాళ్లు అక్కడి నుంచి ఫ్లోరిడాకు చేరుకుంటారు. ఇక ఫ్లోరిడాలో మ్యాచ్‌లు జరుగడం ఇదే చివరిసారి అనుకుంటా. అంతకమించి ఎక్కువ చెప్పలేం.'' అంటూ పేర్కొన్నాడు

కాగా ఇంతకముందు రెండో టి20కి ముందు టీమిండియా ఆటగాళ్లకు లగేజీ సమస్య ఎదురైంది. ట్రినిడాడ్‌ నుంచి సెయింట్‌ కింట్స్‌కు లగేజీ రాక ఆలస్యం కావడంతో మ్యాచ్‌ దాదాపు మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఆటగాళ్ల లగేజీ సమస్యపై విండీస్‌ క్రికెట్‌ బోర్డు క్షమాపణ కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఫ్లోరిడాలోని మియామిలో ఆగస్టు 6,7 తేదీల్లో చివరి రెండు టి20లు జరగనున్నాయి. ఇప్పటికైతే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది.

ఇక మూడో టి20 మ్యాచ్‌లో వెన్నునొప్పితో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగడంతో మిగతా టి20లు ఆడడం అనుమానంగానే ఉంది. ఒకవేళ రోహిత్‌ దూరమైతే.. మిగతా రెండు టి20లకు పంత్‌ టీమిండియా స్టాండింగ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రానున్న ఆసియా కప్‌ దృష్టిలో పెట్టుకొని రోహిత్‌ గాయం నుంచి కోలుకున్నప్పటికి ఆడించడం అనుమానంగానే ఉంది. ఈ విషయంపై బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకోనుంది.

చదవండి: Suryakuamar Yadav: దంచికొట్టిన సూర్యకుమార్‌.. లగ్జరీ కారు ఇంటికొచ్చిన వేళ

IND vs WI: కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ.. తొలి భారత కెప్టెన్‌గా!

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)