Breaking News

ఫైనల్‌కు అర్హత సాధించిన నీరజ్‌ చోప్రా

Published on Thu, 07/30/2026 - 16:22

భారత స్టార్‌ ప్లేయర్‌ నీరజ్ చోప్రా కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026 జావెలిన్‌ త్రో క్వాలిఫయింగ్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐదోస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. కాగా స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా కామన్‌వెల్త్‌ క్రీడలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం జావెలిన్‌ త్రో క్వాలిఫయింగ్‌ రౌండ్‌ నిర్వహించారు. నీరజ్‌ చోప్రాతో పాటు భారత్‌కే చెందిన రోహిత్‌ యాదవ్‌, యశ్‌వీర్‌ సింగ్‌ కూడా ఇందులో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నీరజ్‌ చోప్రా తొలి ప్రయత్నంలో ఈటెను 76.28 మీటర్ల దూరం విసిరాడు.

12 మందికి అర్హత
ఇక రెండో ప్రయత్నంలో అత్యుత్తమంగా 79.61 మీటర్ల దూరం ఈటెను విసిరి ఐదో స్థానం దక్కించుకున్నాడు. కాగా మొత్తంగా 18 మంది జావెలిన్‌ త్రోయర్లు క్వాలిఫయింగ్‌లో పోటీపడ్డారు. అయితే, ఇందులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 12 మంది మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. నీరజ్‌ చోప్రాతో పాటు రోహిత్‌ యాదవ్‌, యశ్‌వీర్‌ సింగ్‌ కూడా టాప్‌-12లో నిలిచి ఫైనల్లో అడుగుపెట్టారు.

రోహిత్‌ యాదవ్‌ అత్యుత్తమంగా ఈటెను 78.37 మీటర్ల దూరం విసరగా.. యశ్‌వీర్‌ సింగ్‌ 78.36 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో వీరిద్దరు తొమ్మిది, పదో స్థానాల్లో నిలిచారు. 

అగ్రస్థానం అతడిదే
ఇక శ్రీలంకకు చెందిన రుమేశ్‌ తరంగ పతిరగే 82.84 మీటర్ల దూరం ఈటెను విసిరి తొలి స్థానం దక్కించుకున్నాడు. మరోవైపు.. పాకిస్తాన్‌ జావెలిన్‌ త్రోయర్‌ అర్షద్‌ నదీమ్‌ 78.63 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి టాప్‌-7లో నిలిచాడు. కాగా భారత కాలమానం ప్రకారం ఆగష్టు 1న ఉదయం 12.45 గంటలకు జావెలిన్‌ త్రో ఫైనల్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.  

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)