Breaking News

ఇంగ్లండ్‌ బౌలర్‌కు షాకిచ్చిన ఐసీసీ

Published on Sun, 08/07/2022 - 09:16

ఇంగ్లండ్‌ మహిళా ఫాస్ట్‌ బౌలర్‌ కేథరిన్‌ బ్రంట్‌కు ఐసీసీ షాకిచ్చింది. మ్యాచ్‌ సమయంలో అసభ్య పదజాలం ఉపయోగించి ఐసీసీ నియమావళి లెవెల్‌-1 నిబంధనను ఉల్లంఘించినందుకు గానూ కేథరిన్‌ను హెచ్చరించడమే గాక మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించింది. ఇక డిసిప్లీనరి యాక్ట్‌ కింద ఒక పాయింట్‌ కోత విధించింది.  ఏడాది కాలంలో కేథరిన్‌ బ్రంట్‌ ఐసీసీ నిబంధన ఉల్లఘించడం ఇది రెండోసారి. ఇప్పటికే రెండు డీమెరిట్‌ పాయింట్లు ఉండడంతో.. మరోసారి నిబంధన ఉల్లంఘిస్తే మాత్రం ఒక మ్యాచ్‌ నిషేధం ఎదుర్కొనే అవకాశం ఉంది.  

విషయంలోకి వెళితే.. శనివారం ఇంగ్లండ్‌, టీమిండియా మహిళల మధ్య కామన్‌వెల్త్‌ గేమ్స్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. భారత బ్యాటింగ్‌ సమయంలో ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ కేథరిన్‌ బ్రంట్‌ వేసింది. దీప్తి శర్మ ఇచ్చిన క్యాచ్‌ను ఫీల్డర్‌ విడిచిపెట్టడంతో కేథరిన్‌ అసభ్య పదజాలం ఉపయోగిస్తూ కోపంగా అరిచింది. ఆమె వ్యాఖ్యలు స్టంప్‌ మైక్‌లో రికార్డ్‌ అయ్యాయి. దీంతో మ్యాచ్‌ అనంతరం  ఐసీసీ నిబంధనల ప్రకారం ఆర్టికల్‌ 2.3 నిబంధన ఉల్లఘించిన కేథరిన్‌ బ్రంట్‌కు హెచ్చరిస్తూ ఒక డీమెరిట్‌ పాయింట్‌ విధిస్తున్నట్లు మ్యాచ్‌ రిఫరీ స్పష్టం చేశారు. 

తొలిసారిగా కామన్వెల్త్‌ క్రీడల్లో ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్‌లో భారత జట్టు సత్తా చాటింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరుస్తూ హర్మన్‌ప్రీత్‌ బృందం ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఫలితంగా స్వర్ణం లేదా రజత పతకం గెలుచుకోవడం ఖాయమైంది. శనివారం ఆసక్తికరంగా జరిగిన తొలి సెమీఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టుపై భారత్‌ 4 పరుగుల తేడాతో గెలిచింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. స్మృతి మంధాన (32 బంతుల్లో 61; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో చెలరేగగా, జెమీమా రోడ్రిగ్స్‌ (31 బంతుల్లో 44 నాటౌట్‌; 7 ఫోర్లు) రాణించింది. మహిళల అంతర్జాతీయ టి20ల్లో భారత్‌ తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ (23 బంతుల్లో)ని స్మృతి నమోదు చేయడం విశేషం. అనంతరం ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది.

ఆఖరి ఓవర్లో గెలుపు కోసం 14 పరుగులు చేసే ప్రయత్నంలో ఇంగ్లండ్‌ 9 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. స్పిన్నర్లు స్నేహ్‌ రాణా (2/28), దీప్తి శర్మ (1/18) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండో సెమీఫైనల్‌ విజేతతో తుది పోరులో భారత తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం నేడు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఫైనల్‌ మొదలవుతుంది. కాంస్య పతక మ్యాచ్‌ మధ్యాహ్నం గం. 3:30 నుంచి జరుగుతుంది.  

చదవండి: Commonwealth Games 2022: క్రికెట్‌లో కనకంపై గురి

మంధాన ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ నమోదు

Videos

విజనరీ ముసుగులో చంద్రబాబు స్కాముల చిట్టా.. పక్కా ఆధారాలతో..

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలవరం

యాపిల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

నా లేఖ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది..

బెంగళూరుపై హైదరాబాద్ విజయం

అప్పుల కుప్ప అమరావతి

హరికృష్ణకు పోలీసుల వేధింపులపై YS జగన్ ఫైర్

వల్లభనేని వంశీని చంపేస్తారా..!

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)