సికందర్‌ రజా మాయాజాలం.. అయినా భారీ స్కోర్‌ చేసిన నెదర్లాండ్స్‌

Published on Tue, 06/20/2023 - 16:39

వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ 2023 గ్రూప్‌-ఏలో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (జూన్‌ 20) జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌ భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు విక్రమ్‌జిత్‌ సింగ్‌ (88), మ్యాక్స్‌ ఒడౌడ్‌ (59), కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (83), ఆఖర్లో సకీబ్‌ జుల్ఫికర్‌ (34 నాటౌట్‌) చెలరేగడంతో డచ్‌ టీమ్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు స్కోర్‌ చేసింది.

జింబాబ్వే బౌలర్లలో సికందర్‌ రజా (4/55), రిచర్డ్‌ నగరవ (2/40) అద్భుతంగా బౌలింగ్‌ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మిగతా బౌలర్లను డచ్‌ బ్యాటర్లు ఆడుకున్నారు. జింబాబ్వే మొత్తం 8 మంది బౌలర్లను ప్రయోగించినా పరుగులను నియంత్రించలేకపోయింది. నెదర్లాండ్స్‌ కోల్పోయిన 6 వికెట్లలో 4 క్లీన్‌ బౌల్డ్‌ అయినవే కావడం విశేషం. సికందర్‌ రజా ముగ్గురిని, నగరవ ఒకరిని క్లీన్‌ బౌల్డ్‌ చేశారు. 

షయాన్‌ జహంగీర్‌ సూపర్‌ సెంచరీ..
ఇవాలే జరుగుతున్న మరో గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో యూఎస్‌ఏ-నేపాల్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఎస్‌ఏ.. 49 ఓవర్లలో 207 పరుగులు చేసి ఆలౌటైంది. వికెట్‌కీపర్‌ షయాన్‌ జహంగీర్‌ (79 బంతుల్లో 100 నాటౌట్‌; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకంతో యూఎస్‌ఏను ఆదుకున్నాడు. జహంగీర్‌కు సుశాంత్‌ మొదానీ (42), గజానంద్‌ సింగ్‌ (26) ఓ మోస్తరుగా సహకరించడంతో యూఎస్‌ఏ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. నేపాల్‌ బౌలర్లలో కరణ్‌ 4, గుల్షన్‌ షా 3, దీపేంద్ర సింగ్‌ 2, లలిత్‌ రాజబంశీ ఓ వికెట్‌ పడగొట్టారు. 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)