Breaking News

CWC 2023: వర్ష సూచన.. సెమీఫైనల్ రద్దైతే ఏమవుతుంది..?

Published on Wed, 11/15/2023 - 12:30

వర్షం కారణంగా వరల్డ్‌కప్‌ 2023 సెమీఫైనల్‌ మ్యాచ్‌లు రద్దైతే ఏం జరుగుందనే ప్రస్తావన ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య కోల్‌కతా వేదికగా నవంబర్‌ 16న జరిగే రెండో సెమీఫైనల్‌కు వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ అంశం తెరపైకి వచ్చింది.

ఒకవేళ నెట్టింట జరుగుతున్న ప్రచారం నిజమై సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్‌ మ్యాచ్‌ రద్దైతే, ఆ మరుసటి రోజు (నవంబర్‌ 17, రిజర్వ్‌ డే) మ్యాచ్‌ను జరిపిస్తారు. ఇక ఆ రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్‌ సాధ్యపడకపోతే మాత్రం లీగ్‌ దశలో మెరుగైన రన్‌రేట్‌ కలిగిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ లెక్కన లీగ్‌ దశలో సౌతాఫ్రికాకు ఆస్ట్రేలియా కంటే మెరుగైన రన్‌రేట్‌ ఉంది కాబట్టి సఫారీలు సెమీస్‌ గండాన్ని గట్టెక్కి ఫైనల్లోకి ప్రవేశిస్తారు.

మరోవైపు ఇవాళ (నవంబర్‌ 15) జరగాల్సిన భారత్‌-న్యూజిలాండ్‌ తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రెండు రోజులు (రిజర్వ్‌ డే) సాధ్యపడకపోతే అప్పుడు లీగ్‌ దశలో మెరుగైన రన్‌రేట్‌ కలిగిన భారత్‌ ఫైనల్లోకి అడుగుపెడుతుంది. వర్షం కారణంగా రెండు సెమీస్‌ మ్యాచ్‌లు రద్దైతే భారత్‌-సౌతాఫ్రికా ఫైనల్స్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి.

ఈ అంశం చర్చించుకోవడానికి బాగానే ఉంది కానీ, జరిగే పని మాత్రం కాదు. ఒకవేళ వర్షం కారణంగా షెడ్యూల్‌ అయిన రోజు మ్యాచ్‌ జరగకపోయినా, రిజర్వ్‌ డే రోజైనా తప్పక జరిగే అవకాశం ఉంటుంది. భారత్‌లో ఇది వర్షాకాలం కాదు కాబట్టి, ఎన్ని అల్పపీడనాలు ఏర్పడినా వాటి ప్రభావం నామమాత్రంగా ఉంటుంది. 


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)