Breaking News

CWC 2023: శ్రీలంకతో మ్యాచ్‌.. పాకిస్తాన్‌ చరిత్ర పునరావృతం చేసేనా..? 

Published on Tue, 10/10/2023 - 11:13

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్‌ 10) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో పాకిస్తాన్‌-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. 

తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను మట్టికరిపించిన ఉత్సాహంలో ఉన్న పాక్‌ టోర్నీలో రెండో విజయంపై కన్నేయగా.. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో అపజయాన్ని ఎదుర్కొన్న శ్రీలంక.. పాక్‌పై ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. 

పాక్‌పై ఒక్క మ్యాచ్‌లో కూడా నెగ్గింది లేదు..
వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో శ్రీలంక.. పాక్‌పై ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా నెగ్గింది లేదు. మెగా టోర్నీలో ఇరు జట్లు 7 సందర్భాల్లో ఎదురెదురుపడగా అన్ని సార్లు పాకిస్తాన్‌దే పైచేయిగా నిలిచింది. దీంతో నేటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పాక్‌కు ఓటమి రుచి చూపించాలని శ్రీలంక జట్టు కసిగా ఉంది. మరోవైపు పాక్‌ ప్రపంచకప్‌లో శ్రీలంకపై తమ జైత్రయాత్రను కొనసాగించేందుకు ప్రణాళికలతో సిద్దంగా ఉంది. 

ఓవరాల్‌గా కూడా పాక్‌దే పైచేయి..
వన్డే క్రికెట్‌లో ఓవరాల్‌గా చూసినా శ్రీలంకపై పాకిస్తాన్‌ స్పష్టమైన ఆధిక్యత కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 156 వన్డేల్లో తలపడగా.. పాక్‌ 92, శ్రీలంక 59 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్‌ టై అయ్యింది.  

ఈసారి లంకతో అంత ఈజీ కాదు..
ప్రపంచకప్‌లోనే కాకుండా ఓవరాల్‌గా చూసినా శ్రీలంకపై స్పష్టమైన ఆథిక్యం కలిగిన పాక్‌కు లంకేయులతో ఈసారి అంత ఈజీ కాదని అనిపిస్తుంది. ఇటీవలికాలంలో ఆ జట్టు ప్రదర్శన చాలా రెట్లు మెరుగుపడింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతి భారీ లక్ష్యన్ని (429) ఛేదిస్తూ కూడా శ్రీలంక అంత ఈజీగా చేతులెత్తేయలేదు. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు పరాజయంపాలైనప్పటికీ, బ్యాటర్లంతా ఫామ్‌లోకి వచ్చారు.

కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లు అసమానమైన తెగువను చూపి భారీగా పరుగులు సాధించారు. కుశాల్‌ మెండిస్‌ (76), అసలంక (79), కెప్టెన్‌ షనక (68) మెరుపు అర్ధసెంచరీలతో విరుచుకుపడటంతో శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లు పాక్‌తో జరిగే మ్యాచ్‌లోనూ ఇదే జోరును కొనసాగించాలని భావిస్తున్నారు. లంక బ్యాటర్లు మరోసారి మెరుపులు మెరిపిస్తే పాక్‌కు కష్టాలు తప్పవు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)