CWC 2023: భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌.. తొలి ఓవర్‌లోనే రికార్డులు బద్దలు

Published on Sat, 10/14/2023 - 14:35

చిరకాల ప్రత్యర్ధులు భారత్‌-పాకిస్తాన్‌ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్‌ 14) జరుగుతున్న హైఓల్టేజీ సమరంలో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. డెంగ్యూ కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన స్టార్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. పాకిస్తాన్‌ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది.

తొలి ఓవర్‌లోనే రికార్డులు బద్దలు..
యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌ వ్యూయర్‌షిప్‌ పరంగా ప్రారంభంలోనే రికార్డులు బద్దలుకొట్టింది. తొలి ఓవర్‌లో రికార్డు స్థాయిలో కోటిన్నర మంది హాట్‌స్టార్‌లో మ్యాచ్‌ను వీక్షించారు. ఓటీటీ చరిత్రలో తొలి ఓవర్‌లో ఈస్థాయిలో మ్యాచ్‌ను వీక్షించడం ఇదే మొదటిసారి. ఇదే కొనసాగితే వ్యూయర్‌షిప్‌ పరంగా ఈ మ్యాచ్‌ ఆల్‌టైమ్‌ రికార్డులు బద్దలుకొట్టడం ఖాయం. 

ఇదిలా ఉంటే, టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు ఓ మోస్తరు ఆరంభం లభించింది. రోహిత్‌ శర్మ ఆశించినట్లు ఆరంభ ఓవర్లలో వికెట్లు దక్కనప్పటికీ.. బుమ్రా పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. తొలి ఓవర్‌లో బౌండరీ మినహాయించి బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. మరో ఎండ్‌లో సిరాజ్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.

అతను వేసిన తొలి ఓవర్‌లో ఇమామ్‌ ఉల్‌ హాక్‌ ఏకంగా మూడు బౌండరీలు బాదాడు. 6 ఓవర్ల తర్వాత పాక్‌ స్కోర్‌ 28/0గా ఉంది. ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (14), అబ్దుల్లా షఫీక్‌ (13) క్రీజ్‌లో ఉన్నారు. సిరాజ్‌ 3 ఓవర్లలో 22 పరుగులు సమర్పించుకోగా.. బుమ్రా 3 ఓవర్లలో ఓ మెయిడిన్‌ వేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)