Breaking News

CWC 2023 ENG VS NZ: రూట్‌ కొంపముంచిన రివర్స్‌ స్వీప్‌

Published on Thu, 10/05/2023 - 17:49

2023 వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్‌ 5) జరుగుతున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఎదురీదుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన బట్లర్‌ సేన ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వస్తుంది. మధ్యలో (ఐదో వికెట్‌కు) కాసేపు (70 పరుగులు) రూట్‌, బట్లర్‌ జోడీ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసినప్పటికీ బట్లర్‌ వికెట్‌ పడ్డాక కథ మళ్లీ మొదటికొచ్చింది.

బట్లర్‌ ఓటయ్యాక 33 పరుగులు జోడించిన అనంతరం లివింగ్‌స్టోన్‌ కూడా ఔటయ్యాడు. దీంతో ఇంగ్లండ్‌ 221 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో అప్పటికే క్రీజ్‌లో పాతుకుపోయిన జో రూట్‌ బాధ్యతాయుతంగా ఆడాల్సింది పోయి నిర్లక్ష్యపు షాట్‌ ఆడి వికెట్‌ పారేసుకున్నాడు. 

రివర్స్‌ స్వీప్‌ జో రూట్‌ (77) కొంపముంచింది..
ఈ ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచి క్రమం తప్పకుండా రివర్స్‌ స్వీప్‌ షాట్లు ఆడి సక్సెస్‌ సాధించిన రూట్‌.. గ్లెన్‌ ఫిలిప్స్‌ బౌలింగ్‌ మరోసారి అదే ప్రయత్నం చేయబోయి మూల్యం చెల్లించుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రూట్‌ అనవసరపు షాట్‌కు ప్రయత్నించి ఫిలిప్స్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. ఫలితంగా ఇంగ్లండ్‌ 229 పరుగుల వద్ద (41.1 ఓవర్లు) ఏడో వికెట్‌ కోల్పోయింది. 

ఆఖర్లో కుదురుకున్న ఇంగ్లండ్‌.. గౌరవప్రదమైన స్కోర్‌
ఇంగ్లండ్‌ టెయిలెండర్లు ఆఖర్లో తలో చేయి వేసి ఓ మోస్తరు పరుగులు సాధించడంతో ఇంగ్లండ్‌ ఊహించిన దాని కంటే ఎక్కువ పరుగులు స్కోర్‌ చేసింది. 252 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌ మరో 30 పరుగులు జోడించి 282 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.

మార్క్‌ వుడ్‌ (13), ఆదిల్‌ రషీద్‌ (15) అజేయంగా నిలువగా.. బెయిర్‌స్టో (33), మలాన్‌ (14), బ్రూక్‌ (25), మొయిన్‌ అలీ (11), బట్లర్‌ (43), రూట్‌ (77), లివింగ్‌స్టోన్‌ (20), సామ్‌ కర్రన్‌ (14), క్రిస్‌ వోక్స్‌ (11) ఔటయ్యారు. కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 3, సాంట్నర్‌, ఫిలిప్స్‌ తలో 2, బౌల్ట్‌, రవీంద్ర చెరో వికెట్‌ దక్కించుకున్నారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)