Breaking News

CWC 2023: ఇండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు సంబంధించి గుడ్‌ న్యూస్‌ చెప్పిన బీసీసీఐ

Published on Sun, 10/08/2023 - 09:11

యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్‌-పాకిస్తాన్‌ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌కు సంబంధించి భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (బీసీసీఐ) ఓ ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈనెల (అక్టోబర్‌) 14న జరుగనున్న ఈ హైఓల్టేజీ పోరుకు సంబంధించి 14,000 టికెట్లను ఇవాళ (అక్టోబర్‌ 8) ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి వరల్డ్‌కప్‌ అధికారిక టికెటింగ్ వెబ్‌సైట్‌లో ( https://tickets.cricketworldcup.com,”) టికెట్లు అందుబాటులో ఉంటాయని బోర్డు తెలిపింది. 

కాగా, వరల్డ్‌కప్‌లో భారత్‌-పాక్ మ్యాచ్‌కు సంబంధించి అదనపు టికెట్లు విడుదల చేయడం ఇది తొలిసారి కాదు. గత నెలలో కూడా బీసీసీఐ భారీ సంఖ్యలో టికెట్లను విడుదల చేసింది. వరల్డ్‌కప్‌-2023 ఓపెనింగ్‌ మ్యాచ్‌కు (ఇంగ్లండ్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌) ప్రేక్షకుల ఆదరణ కరువైన నేపథ్యంలో బీసీసీఐ టికెట్ల సంఖ్యను పెంచుతూ జనాలను ఆకర్శించే పనిలో పడింది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు నరేంద్ర మోదీ స్టేడియం కిక్కిరిసిపోవడమే లక్ష్యంగా బీసీసీఐ పెద్దలు అదనపు టికెట్లను రిలీజ్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్‌.. ఇవాళ (అక్టోబర్‌ 8) తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభంకానుంది. మరోవైపు ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు పూర్తైన విషయం తెలిసిందే. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ అద్భుత విజయం సాధించగా.. రెండో మ్యాచ్లో నెదార్లండ్స్‌పై పాక్‌ సూపర్‌ విక్టరీ సాధించింది. నిన్న జరిగిన 2 మ్యాచ్‌ల్లో తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై బంగ్లాదేశ్‌.. శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయాలు నమోదు చేశాయి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)