Breaking News

CWC 2023: ప్రపంచకప్‌లో ఇవాళ రసవత్తర సమరం

Published on Thu, 10/12/2023 - 11:47

ప్రపంచకప్‌-2023లో ఇవాళ (అక్టోబర్‌ 12) రసవత్తర సమరం జరుగనుంది. లక్నోలోని అటల్‌ బిహారీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా తలపడనున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే ఈ హోరాహోరీ పోరులో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు చెరో మ్యాచ్‌ ఆడాయి. సౌతాఫ్రికా శ్రీలంకపై ఘన విజయం సాధించగా.. ఆస్ట్రేలియా.. టీమిండియా చేతిలో ఓటమిపాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా నాలుగో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా ఏడో స్థానంలో నిలిచింది.  

ఆస్ట్రేలియాదే పైచేయి..
వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్లు ఇప్పటివరకు 6 సార్లు ఎదురెదురు పడగా.. ఆస్ట్రేలియా 3, సౌతాఫ్రికా 2 పర్యాయాలు విజయాలు సాధించాయి. ఓ మ్యాచ్‌ టై అయ్యింది.  ఈ ఇరు జట్లు చివరిసారిగా 2019 ప్రపంచకప్‌లో తలపడగా.. ఆ  మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. 

ఫేవరెట్‌గా సౌతాఫ్రికా..! 
ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌ ఎవరన్న విషయాన్ని పరిశీలిస్తే.. ప్రస్తుత ఫామ్‌ ప్రకారం సౌతాఫ్రికాయే అని చెప్పాలి. వరల్డ్‌కప్‌కు ముందు ఇరు జట్లు తలపడిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికానే కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన సఫారీలు.. ఆతర్వాత ఆనూహ్యంగా పుంజుకుని వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ చేజిక్కించుకున్నారు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లోనూ సౌతాఫ్రికా అదే ఫామ్‌ను కొనసాగించింది.

శ్రీలంకతో ఆడిన తొలి మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు ప్రొటీస్‌ ఆటగాళ్లు సెంచరీలు చేశారు. ఫలితంగా ఆ జట్టు వరల్డ్‌కప్‌లో అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. ఆసీస్‌ విషయానికొస్తే.. వరల్డ్‌కప్‌కు ముందు సౌతాఫ్రికా చేతిలో ఓటమిపాలైన ఆ జట్టు.. ఆతర్వాత భారత్‌తో జరిగిన సిరీస్‌ను కూడా 1-2తేడాతో కోల్పోయింది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లోనూ ఆసీస్‌.. టీమిండియా చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో స్వల్ప స్కోర్‌కే (199) పరిమితమైన ఆ జట్టు, దాన్ని కాపాడుకోవడం విఫలమైంది. 

తుది జట్లు (అంచనా)..
ఆస్ట్రేలియా: డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, మార్నస్‌ లబూషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, అలెక్స్‌ క్యారీ, పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), ఆడమ్‌ జంపా, మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌

సౌతాఫ్రికా: క్వింటన్‌ డికాక్‌, టెంబా బవుమా (కెప్టెన్‌), రస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, మార్కో జన్సెన్‌, కేశవ్‌ మహారాజ్‌, కగిసో రబాడ, తబ్రేజ్‌ షంషి, లుంగి ఎంగిడి 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?