Breaking News

CWC 2023: టీమిండియాతో మ్యాచ్‌కు ముందు గాయపడ్డ ఆస్ట్రేలియన్‌ స్టార్‌ ప్లేయర్‌

Published on Sun, 10/08/2023 - 08:02

చెన్నై వేదికగా టీమిండియాతో ఇవాళ (అక్టోబర్‌ 8) జరుగనున్న వరల్డ్‌కప్‌ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా స్విమ్మంగ్‌ పూల్‌లో గాయపడ్డాడు. కళ్లు మూసుకుని స్విమ్మింగ్‌ చేసిన జంపా పూల్‌లో ఉన్న మెట్లను గుద్దుకుని గాయాలపాలయ్యాడు. జంపా ముఖంపై, ఇతర చోట్ల గాయాలైనట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది. అయితే ఈ స్వల్ప గాయాల కారణంగా జంపా టీమిండియాతో మ్యాచ్‌కు దూరమయ్యే ప్రమాదమేమీ లేదని సీఏ క్లారిటీ ఇచ్చింది. జంపా 100 శాతం ఫిట్‌గా ఉన్నాడని తెలిపింది.

కాగా, ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఉపఖండపు స్విమ్మింగ్‌ పూల్‌లలో గాయపడటం ఇది కొత్తేమీ కాదు. గతేడాది ఆ జట్టు వికెట్‌కీపర్‌ అలెక్స్‌ క్యారీ కరాచీలోని ఓ హోటల్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో కిందపడిపోయాడు. ఆ సమయంలో క్యారీ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఘటన తర్వాత క్యారీ బ్యాటింగ్‌లో రెచ్చిపోయాడు. కెరీర్‌లో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఆ తర్వాత ఆడిన 9 టెస్ట్‌ల్లో 71.83 సగటున పరుగులు చేశాడు. ఈ విషయం గురించి తెలిసిన తర్వాత భారత క్రికెట్‌ అభిమానులు వ్యంగ్యమైన కామెంట్స్‌ చేస్తున్నారు. పూల్‌లో పడిపోవడం క్యారీకి, ఆసీస్‌కు కలిసొచ్చినట్లుందని అంటున్నారు. 

ఇదిలా ఉంటే, భారత్‌తో మ్యాచ్‌లో జంపా ఆడటంపై ఎలాంటి అనుమానాలు లేనప్పటికీ.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ హ్యామ్‌స్ట్రింగ్‌ గాయం మాత్రం ఆసీస్‌ను ప్రధానంగా వేధిస్తుంది. గాయాం నుంచి పూర్తిగా కోలుకోని స్టోయినిస్‌ భారత్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం అనుమానమేనని తెలుస్తుంది. మరోవైపు గాయాల బెడద టీమిండియాకు కూడా ప్రధాన సమస్యగా మారింది. అసలే శుభ్‌మన్‌ గిల్‌ అందుబాటులో లేక సతమతమవుతున్న భారత్‌కు హార్దిక్‌ పాండ్యా చేతి గాయం పెద్ద తలనొప్పిగా మారింది.

గత వారం రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్న గిల్‌ ఆసీస్‌తో ఇవాల్టి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం దాదాపుగా ఖరారు కాగా.. హార్దిక్‌ సైతం గిల్‌ బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తుంది. అయితే హార్దిక్‌ గాయంపై కంగారు పడాల్సిన అవసరం లేదని టీమిండియా మేనేజ్‌మెంట్‌ చెప్పుకొస్తుంది. ఏదిఏమైనప్నపటికీ.. గిల్‌, పాండ్యా ఇద్దరూ ఆసీస్‌తో మ్యాచ్‌కు దూరమైతే అది టీమిండియా విజయావకాశాలను భారీ దెబ్బతీస్తుంది. చెన్నైలోని చిదంబరంలో స్టేడియంలో మ్యాచ్‌ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)