Breaking News

ఒత్తిడిలోనూ మా వాళ్లు అద్భుతం.. వాళ్లు కూడా బాగా ఆడారు: రోహిత్‌ శర్మ 

Published on Thu, 11/16/2023 - 09:08

ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్‌ 70 పరుగుల తేడాతో గెలుపొంది, నాలుగోసారి వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు చేరింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్‌ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), శుభ్‌మన్‌ (66 బంతుల్లో 80 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రాహుల్‌ (20 బంతుల్లో 39 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసింది. 

అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ను డారిల్‌ మిచెల్‌ (134), విలియమ్సన్‌ (69), గ్లెన్‌ ఫిలిప్స్‌ (41) గెలిపించేందుకు ప్రయత్నించారు. ఓ దశలో వీరు ముగ్గురు టీమిండియాను భయపెట్టారు. అయితే లక్ష్యం పెద్దది కావడంతో చేయాల్సిన ప్రయత్నం చేసి చేతులెత్తేశారు. మిచెల్‌, విలియమ్సన్‌, ఫిలిప్స్‌ మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్‌ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై మెగా టోర్నీ నుంచి మరోసారి రిక్తహస్తాలతో నిష్క్రమించింది.  

మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ ఇలా అన్నాడు. భారీ ఛేదనలో న్యూజిలాండ్‌ ఆటగాళ్లు శక్తివంచన లేకుండా ప్రతిఘటించారు. డారిల్‌ మిచెల్, విలియమ్సన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఓ దశలో వారు మాకు చాలా అవకాశాలు ఇచ్చారు. మేము వాటిని ఒడిసిపట్టుకోవడంలో విఫలమయ్యాం. మాపై ఒత్తిడి ఉండింది. అయినా ప్రశాంతంగా ఉండగలిగాం.

బౌలింగ్‌ విషయానికొస్తే..  మా బౌలర్లందరూ చేయాల్సి ప్రతి ప్రయత్నం చేశారు. షమీ అద్భుతంగా బౌలింగ్‌ చేసి సక్సెస్‌ సాధించాడు. మా టాపార్డర్‌ బ్యాటింగ్‌ అద్భుతం. అయ్యర్ సూపర్‌ టచ్‌లో ఉన్నాడు. అతని ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. గిల్, రాహుల్‌ పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్‌ చేస్తున్నారు. కోహ్లీ ఎప్పటిలాగే అద్భుతంగా ఆడాడు. తన ట్రేడ్‌మార్క్ ఇన్నింగ్స్‌తో చిరస్మరణీయ మైలురాయిని అందుకున్నాడు. మొత్తంగా మా బ్యాటింగ్‌ సంతృప్తిని​చ్చింది. మొదటి తొమ్మిది మ్యాచ్‌ల్లో (లీగ్‌ దశ) ఏం చేశామో ఈ మ్యాచ్‌లోనూ అదే చేయాలనుకున్నాం. అలాగే చేశాం. ఫలితం​ సాధించాం.

చదవండి: 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)