Breaking News

ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన అశ్విన్‌

Published on Wed, 08/27/2025 - 10:53

టీమిండియా స్పిన్ లెజెండ్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ దిగ్గ‌జం ర‌వి చంద్ర‌న్ అశ్విన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. బుధవారం సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న నిర్ణ‌యాన్ని అశ్విన్ వెల్ల‌డించాడు.

"నా కెరీర్‌లో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. ఐపీఎల్ క్రికెటర్‌గా నా ప్రయాణ​ ఈ రోజుతో ముగిసింది.  కానీ ప్రతీ ​ముగింపునకు ఒక కొత్త ప్రారంభం ఉంటుంది. ఇకపై వివిధ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఆడేందుకు నా అన్వేషణను మొదలు పెట్టనున్నాను.

ఈ 16 ఏళ్ల ఐపీఎల్ జర్నీలో నాకు ఎన్నో​ అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు సపోర్ట్‌గా నిలిచిన అన్ని ఫ్రాంచైజీలకు, బీసీసీఐకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని  తన రిటైర్మెంట్ నోట్‌లో అశ్విన్ రాసుకొచ్చాడు. ఈ ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్‌.. ఇప్పుడు ఐపీఎల్ నుంచి కూడా త‌ప్పుకొన్నాడు.

2009లో సీఎస్‌కే త‌ర‌పున ఐపీఎల్ అరంగేట్రం చేసిన అశ్విన్‌.. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో త‌న‌కంటూ ఓ ప‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మొత్తంగా 221 ఐపీఎల్ మ్యాచ్‌ల‌లో 187 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అంతేకాకుండా బ్యాటింగ్‌లో కూడా 833 ప‌రుగులు సాధించాడు. 

38 ఏళ్ల అశ్విన్ ఐపీఎల్‌లో ఐదు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. సీఎస్‌కే, రైజింగ్  పూణే సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ త‌ర‌పున ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్ ముందు వ‌ర‌కు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఫ్రాంచైజీలో అశ్విన్ భాగంగా ఉన్నాడు. 

అయితే ఐపీఎల్‌-2025 మెగా వేలానికి ముందు అశూను రాజ‌స్తాన్ విడిచిపెట్టడంతో రూ. 9.75 కోట్ల భారీ ధ‌ర‌కు సీఎస్‌కే కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజ‌న్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ కేవ‌లం 7 వికెట్లు మాత్ర‌మే ప‌డ‌గొట్టాడు. దీంతో వ‌చ్చే ఏడాది సీజ‌న్‌కు ముందు అశ్విన్‌ను సీఎస్‌కే విడిచిపెట్టేందుకు సిద్ద‌మైనట్లు వార్త‌లు వ‌చ్చాయి. 

అంత‌లోనే రిటైర్మెంట్ ప్ర‌క‌టించి అంద‌రికి షాకిచ్చాడు. అశ్విన్ ఇక బిగ్ బాష్ లీగ్‌, సౌతాఫ్రికా టీ20, మేజర్ లీగ్ క్రికెట్ వంటి విదేశీ ఫ్రాంచైజీ లీగ్స్‌లో ఆడే అవకాశముంది. కాగా భారత ఆటగాడు విదేశీ లీగ్స్‌లో ఆడాలటే భారత క్రికెట్‌కు సంబంధించి అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలి.
చదవండి: విజయ్ శం‍కర్ సంచలన నిర్ణయం.. 13 ఏళ్ల బంధానికి ముగింపు?

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)